మన తెలుగు అమ్మాయి వాసుకి ని గెలిపించటం మన చేతుల్లో నే ఉంది ఎలా అంటే....

 విశ్వసుందరి పోటీలు తుదిదశకు చేరుకుంటున్న ఈ సమయంలో మనం కూడా మన వంతుగా ఆమెకు చేయూతను అందించాలి. మన తెలుగుతనపు అందాల ప్రతినిధిగా మిగిలిన ప్రపంచంతో ఒక తెలుగమ్మాయి చేస్తున్నది ఒంటరిపోరు కాదని నిరూపించాలి. అంటే... వాసుకి సుంకపల్లికి ఓటేయాలి. ఆమె విజయానికి ‘బాట’వేయాలి. విజయీభవ అని తెలుగింటి ఆడపడుచును ఆశీర్వదిద్దాం... విశ్వమంతా తెలుగు సౌందర్యం ముందు తలవంచే ఘడియను ఆస్వాదిద్దాం. రండి, ఆన్‌లైన్‌లో మనమ్మాయికి ఓటేద్దాం.
వాసుకి కి ఓటేయడం వెరీ సింపుల్!
ఫస్ట్ స్టెప్: www.missuniverse.com అని టైప్ చేసి సైట్‌లోకి వెళ్లండి.

సెకండ్ స్టెప్: contestants అప్షన్‌ని క్లిక్ చెయ్యండి. ఇక్కడ మీకు మిస్ యూనివర్స్ సెమీఫైనలిస్ట్‌ల పేర్లు, ఫొటోలు, వారి దేశాలు డిస్‌ప్లే అవుతాయి. వీటిల్లో మన వాసుకి ఫొటో ఉంటుంది.

థర్డ్ స్టెప్ : వాసుకి ఫొటో పక్కనే vote అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చెయ్యండి. చిన్న బాక్స్ ప్రత్యక్షం అవుతుంది.

ఫోర్త్ స్టెప్: ఆ బాక్సులో మీ ఇ-మెయిల్, కోడ్ నింపండి. కోడ్ అంటే మరేం లేదు. పైన మీకు కనిపించే ఇంగ్లీషు అక్షరాలనే కింద రిపీట్ చెయ్యాలి. కోడ్ నింపాక, దాని కింద కనిపించే రెండు చిన్న బాక్సులో టిక్ పెట్టండి. వాటి కిందే మీకు 1 నుంచి 10 వరకు ఓటింగ్ స్కేల్ కనిపిస్తుంది. 10 అన్నచోట క్లిక్ చెయ్యండి.

ఫైనల్ స్టెప్: submit vote for INDIA అన్నచోట క్లిక్ చెయ్యండి. అంతే! మీ ఓటు వాసుకికి పడిపోయినట్లే.

ఒక్కో ఇ-మెయిల్ మీద రోజుకు పది ఓట్లు వేయవచ్చు. ఓటింగ్‌కి గడువు తేదీ: 11 సెప్టెంబర్ 2011 విజేతల ఎంపికకు ఆన్‌లైన్ ఓటింగ్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవడం ‘మిస్ యూనివర్స్’ పోటీలలో ఇదే ప్రథమం. ఆన్‌లైన్‌లో ఎక్కువ ఓట్లు పోలైన అభ్యర్థులు 15 మంది సెమీ ఫైనలిస్టులలో ఒకరిగా స్థానం సంపాదిస్తారు. బ్రెజిల్‌లోని సావో పౌలో నగరంలో సెప్టెంబర్ 12న ఫైనల్స్ జరుగుతాయి. 89 దేశాల సుందరాంగులు ఈ పోటీలో పాల్గొంటున్నారు. వారిలో మన తెలుగమ్మాయి వాసుకి సుంకపల్లి ఒకరు. 

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top