ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వంటల గురించి తెలుసుకోవడానికి వెబ్‌సైట్ల గురించి తెలుసుకుందాం...

ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వంటల గురించి తెలుసుకోవడానికి ఎన్నో సాధనాలు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు మరికొంచెం సమాచారం అందించడానికి కొన్ని వెబ్‌సైట్లు రూపుదిద్దుకున్నాయి. ఇలా ముస్తాబైన వాటిలో ప్రజల ఆదరణ పొందిన వెబ్‌సైట్ల గురించి తెలుసుకుందాం...

క్రిప్స్ ఆఫ్ ర్యాత్‌డాట్ నెట్ (crepesofwrath.net)..
న్యూయార్క్‌కు చెందిన ఈ వెబ్‌సైట్ 2008 సంవత్సరం నుంచి నడుస్తోంది. దీనిలో ఆరు వందల వంటకాల గురించి తెలుసుకోవచ్చు. కావలసిన పదార్థాల నుంచి తయారీ వరకు అన్ని వివరాలు క్రిప్స్ ఆఫ్ ర్యాత్ డాట్ నెట్‌లో ఉంటాయి. దీనిని 22 ఏళ్ల సిడ్నీ అనే అమ్మాయి నడుపుతోంది.

అర్చనాస్‌కిచెన్ డాట్ కామ్(archanaskicthen.com)...
అర్చన అనే బెంగళూరు అమ్మాయి దీనిని నిర్వహిస్తోంది. ఇందులో శాకాహార వంటకాలు మాత్రమే ఉంటాయి. వాటిని మూడు విభాగాలుగా విభజించి అందిస్తోంది. ఇందులో లేని వంటకాలను పాఠకులు కూడా పంపించవచ్చు.


ఫుడిలీ డాట్ కామ్ (foodily.com)
వంటకాలకు సంబంధించి ఇదొక సోషల్ నెట్‌వర్క్ వెబ్‌సైట్. దీని కోసం ఫేస్‌బుక్‌లో అకౌంట్ ఆరంభించవచ్చు. ఉదాహరణకు ఒకసారి ఇందులో లాగిన్ అయి మాంసం లేని పిజ్జా కోసం రెసిపీ కోరితే దాదాపు 3,700 రకాలు మీకు దొరుకుతాయి. ఇలాంటివి చాలా సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.

పంచ్‌ఫోర్క్ డాట్ కామ్(punchfork.com)....
ప్రసిద్ధి చెందిన వంటల మ్యాగజైన్‌లలో, పత్రికలలో ఆ వారం వచ్చిన రుచులను లే ఔట్‌తో సహా అందిస్తుంది పంచ్‌ఫోర్క్ డాట్ కామ్.

101 కుక్‌బుక్స్ డాట్ కామ్ (101cookbooks.com)..
వంద వంట పుస్తకాలతో సమానం మా వెబ్‌సైట్ అంటారు దీని నిర్వాహకులు. కాలిఫోర్నియాకు చెందిన ఈ 101 కుక్‌బుక్స్ వెబ్‌సైట్ 2003 నుంచి కొనసాగుతోంది. దీనిని వంటల సముద్రం అని పిలవ్వచ్చని దీనిని ఫాలో అయ్యేవారు అంటుంటారు.
 

గోజి డాట్ కామ్(gojee.com)...
మీ కిచెన్‌లో ఏం ఉన్నాయో చెబితే వాటితో ఏ వంటకం చేయొచ్చో ఈ వెబ్‌సైట్ చెబుతుంది. గోజి డాట్ కామ్‌లోకి వెళ్లగానే ఏ వంట చేస్తున్నారన్న ప్రశ్న వస్తుంది. సమాధానం చెప్పగానే ఆ వంటకానికి ఏమేం కావాలో చెబుతుంది. ఆ వెంటనే మీ దగ్గర అవన్నీ వున్నాయా? అని అడుగుతుంది. జవాబుగా మీరు 'లేవు' అని చెబితే ప్రత్యామ్నాయం సూచిస్తుంది. రోజు రోజుకూ ఆదరణ పెరుగుతున్న వెబ్‌సైట్లలో గోజి ముందు వరుసలో ఉంది. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top