మధుమేహం... కీళ్లమార్పిడికి ఆటంకం కాదు

మన దేశంలో మధుమేహం ఒక సాధారణ సమస్య. దాదాపు ఇంటికొకరు చొప్పున నేడు మధుమేహ బాధితులు కనిపిస్తున్నారు. మోకాలు చిప్ప మార్పిడి చికిత్స అవసరం ఎక్కువగా వయసు పైబడిన వారికే ఉంటుంది.

ఈ మధుమేహం కూడా వారిలోనే ఎక్కువగా ఉంటుంది. మధుమేహం ఉన్న వారు శస్త్ర చికిత్సకు వెళుతున్నప్పుడు కొన్ని అదనపు జాగ్రత్తలు తీసుకోవలసి రావచ్చు. కానీ, ఆ జాగ్రత్తలే భారమనుకుని అందుబాటులో ఉన్న ప్రయోజనకర చికిత్సలకు దూరంగా ఉండడంలో అర్థం లేదు.

ఆ అదనపు జాగ్రత్తలైనా షుగర్ నియంత్రణ లో లేనప్పుడే. నిజంగా మందులతో లేదా ఇన్సులిన్‌తో వ్యాధి నియంత్రణలో ఉన్న వారు, మధుమేహం లేని వారు ఇద్దరూ శస్త్ర చికిత్స విషయంలో సమానమే. చిన్నా చితకా ఇబ్బందులు ఏమున్నా అవి ఇద్దరికీ సమానంగానే ఉంటాయి. కాకపోతే, షుగర్ ఏ స్థాయిలో నియంత్రణలో ఉంటోంది అనేది ముఖ్యమే.

మధుమేహం దీర్ఘకాలికంగా నియంత్ర ణలో లే నివారిలో కొన్ని ఇతర సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంది. వాటిలో ముఖ్యంగా కిడ్నీ సమస్యలు (నెఫ్రోపతి), నరాలు దెబ్బతినే న్యూరోపతి సమస్యలు ఉండవచ్చు.

అలాగే దీర్ఘకాలికంగా మధుమేహం ఉన్న వారిలో కొందరికి కాళ్లకు రక్తప్రసరణ తగ్గిపోయే వ్యాస్కులోపతి సమస్య రావచ్చు. మధుమేహం ఉన్న వారికి మోకాలు చిప్ప మార్పిడి శస్త్ర చికిత్స చేయడానికి ముందు ఈ సమస్యలు ఏమైనా ఉన్నాయేమో పరీక్షించుకోవలసి ఉంటుంది. నిజంగానే అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటిని నియంత్రించే చికిత్సలు చేయాలి.

శస్త్ర చికిత్స తాలూకు ఒత్తిడి వల్ల కిడ్నీల మీద, గుండె మీద కొంత భారం పడుతంది. కిడ్నీల శక్తిని అంచనా వేయడానికి ఒకసారి రీనల్ ఫంక్షనింగ్ టెస్ట్, గుండె పనితీరును అంచనా వేయడానికి ఇకో-కార్డియోగ్రామ్ పరీక్ష చేయవలసి ఉంటుంది. ఒకవేళ గుండె, కిడ్నీలు బలహీనంగా ఉంటే వాటి శక్తిని పెంచే మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మధుమేహం ఉన్న వారిలో చాలా మంది ఆహారం మోతాదు తగ్గిస్తూ వెళతారు దీని వల్ల పోషక లోపాలు ఏర్పడి శరీరం బాగా బలహీన పడుతుంది. తిరిగి వారి శరీరాన్ని శక్తివంతంగా మార్చకపోతే శస్త్ర చికిత్స తరువాత కోలుకోవడానికి కొంత ఎక్కువ సమయం పడుతుంది.

వీరిలో ప్రొటీన్ కూడా త గ్గిపోవడం వల్ల గాయం మానడానికి కూడా ఎక్కువ సమయమే పట్టవచ్చు. అందువల్ల ఈ సమస్యలన్నిటినీ నియంత్రించే చికిత్సలు ముందు చేయాలి. కీలు మార్పిడి చికిత్స తక్షణమే చేయవలసిన అత్యవసరం ఏమీ ఉండదు కాబట్టి, మిగతా లోపాలు తొలగిపోయే దాకా కొంత కాలం శస్త్ర చికిత్సను వాయిదా వేసుకోవచ్చు. మధమేహంతో పాటు ఉన్న ఇతర సమస్యలన్నిటినీ అదుపులోకి తీసుకురావడానికి కొన్నిసార్లు శస్త్ర చికిత్సకన్నా ముందే ఆసుపత్రిలో చేర్పించవలసి రావచ్చు.

ఇతర సమస్యలన్నీ నియంత్రణలోకి వచ్చిన తరువాత శస్త్ర చికిత్స చేయించుకుంటే అది ఈ సమస్యలేవీ లేని వారు శస్త్ర చేయించుకోవడానికి సమానమే అవుతుంది. వాస్తవానికి ఇతర సమస్యలు మరీ తీవ్రంగా ఉండే వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది. ఒక స్థాయిలో ఆ సమస్యలు ఉన్నా వాటిని నియంత్రణలోకి తీసుకు రావాలే గానీ, ఆ సమస్యలు ఉన్న కారణంగా శస్త్ర చికిత్స అసలే వద్దు అనుకుని జీవిత కాలమంతా కీళ్ల బాధలు భరిస్తూ ఉండిపోవలసిన అవసరం లేదు. మ«ధుమేహంలో కొందరికి కొద్దిపాటి కిడ్నీ సమస్యలు ఉండే మాట నిజమే.

అయితే అవి 80 శాతానికి మించి దెబ్బ తిన్నప్పుడే ప్రమాదంలో పడినట్టు అవుతుంది. అప్పుడే కిడ్నీలు సరిగా పనిచేయలేని స్థితిలో ఉంటాయి. అలా కాకుండా ఏ 30 శాతమో 40 శాతమో దెబ్బ తిన్నప్పుడు శస్త్ర చికిత్సకు అదేమీ అడ్డంకి కాదు. శస్త్ర చికిత్స కోసం వచ్చిన సమయంలో చేసే పలు పరీక్షల్లో అనుకోకుండా మిగతా అవయవాల స్థితిగతుల గురించి తెలుసుకునే ఒక సావకాశం ఏర్పడుతుంది.

దాని వల్ల మోకాళ్ల చికిత్సతో పాటే, మొత్తం శరీర అవయవాల రక్షణకు సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకునే వీలు కలుగుతుంది. ఒక రకంగా ఇది అనుకోని ప్రయోజనం. మధుమేహం ఉన్నప్పుడు వ్యాధిని నియంత్రించుకుని శస్త్ర చికిత్స చేయించుకోవాలి.

అంతే గానీ, ఆ కారణంగా శస్త్ర చికిత్సను వాయిదా వేస్తే కదల్లేని స్థితిలో శరీరం మరింత బరువెక్కుతుంది. దీనివల్ల కీళ్లు వేగంగా క్షీణించి ఒక దశలో మంచ ంలోనే పడి ఉండవలసి రావచ్చు.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top