రసగుల్లా మలాయ్


రసమలాయ్ అనగానే చాలా టైం పడుతుంది అనుకుంటారు. కాని ఇక్కడ మీకోసం త్వరగా అయ్యే పద్ధతిలో ఈ వంటకాన్ని ఇస్తున్నాం. కావలసినవి:
ఒక డబ్బా రసగుల్లాలు, నాలుగు కప్పుల పాలు, పావు కప్పు పంచదార, పావు టీస్పూను యాలకులపొడి, పావు కప్పు గోరువెచ్చటి పాలలో కొద్దిగా కుంకుమపువ్వు నానపెట్టాలి. అలంకరించుకునేందుకు నట్స్.
తయారీ:

స్టవ్ పైన నాన్‌స్టిక్ పాన్ పెట్టి అందులో పాలు పోసి మరిగించేటప్పుడు అడుగు అంటకుండా గరిటెతో కలియపెడుతుండాలి. పాలు చిక్కగా ఉండడాన్ని ఇష్టపడేవాళ్లు తప్పనిసరిగా 30 నిమిషాల పాటు మరిగించాలి. బాగా మరిగిన తరువాత పంచదార, కుంకుమపువ్వు, యాలకుల పొడి కలపాలి. స్టవ్ మీద నుంచి గిన్నె దింపి పాలు చల్లారిన తరువాత రసగుల్లాలను గట్టిగా ఒత్తి పాలలో వేయాలి. తీపి తక్కువైందనుకుంటే రసగుల్లా డబ్బాలో ఉన్న పంచదార ద్రవాన్ని కలుపుకోవచ్చు. పైన డ్రైఫ్రూట్స్‌తో అలంకరించి తింటే ఆహా... అనాల్సిందే.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top