అధికంగా జుట్టు ఊడిపోవడానికి కారణాలు-నివారణ-హోమియో చికిత్స

ఇటీవలి కాలంలో జుట్టురాలిపోవడం, నెరిసిపోవడం వంటి సమస్యలు ఎక్కువగా కని పిస్తున్నాయి. సాధారణంగా ఒక్కొక్క కేశం రెండేళ్ల నుంచి మూడేళ్లు పెరుగుతుంది. ఆ పెరుగుదల రేటు నెలకు ఒక సెంటీమీటరు చొప్పున ఉంటుంది. కొన్ని కేశాలు ఊడిపోయి ఆ స్థానంలో కొత్తవి వస్తాయి. ఈ చక్రంలో సాధారణంగా ప్రతిరోజూ కొంతజుట్టు ఊడిపోతూ ఉంటుంది. ఇది కొంతమందిలో అధికంగా ఊడిపోవచ్చు. 


అధికంగా జుట్టు ఊడిపోవడానికి కారణాలు
వయసు పెరుగుతున్నకొద్దీ కేశాలమూలాలు కుంచించికు పోయి కొత్తవెంట్రుకల ఉత్పత్తి తగ్గిపోవచ్చు. ఇది వంశపారంపర్యంగా ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది.

సీజనల్ మార్పులు, పోషకాహార లోపం, దీర్ఘవ్యాధులు, హార్మోన్ సమస్యలు. థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే హార్మోన్లు అధికంగా విడుదలవటం లేదా తక్కువగా ఉండటం వల్ల కూడా జుట్టు అధికంగా ఊడిపోవచ్చు.

బిడ్డపుట్టిన తర్వాత స్త్రీలలో జుట్టు రాలిపోవడం అధికమవుతుంది. గర్భిణీకి ఈ సమయంలో అధికంగా విడుదలయ్యే హార్మోన్ల మూలంగా ఈ స్థితి రావచ్చు.

కొన్ని రకాల మందులు వాడటం మూలంగానూ, ఇంకా కొన్నిరకాల ఇన్ఫెక్షన్లు, డయాబెటిస్, అధిక ఒత్తిడి మూలంగా కూడా జుట్టు ఊడిపోతుంది. 


నివారణ: 
ఏ రోగానికైనా చికిత్స కన్నా రోగం రాకుండా నిరోధించుకోవటం తేలిక. కృత్రిమంగా తయారయ్యే హెయిర్‌డైలను, కృత్రిమరంగులను తరచు జుట్టుకు ఉపయోగించరాదు. నిర్ణీత కాలవ్యవధిలో అంటే వారానికి ఒకటి రెండుసార్లు మంచి షాంపూతో తలస్నానం చేసి తడిలేకుండా జుట్టును శుభ్రంగా తుడుచుకోవాలి.

ఆహారంలో అన్ని పోషకాలూ ఉండేటట్లు చూసుకోవటం, ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవటం, క్యాల్షియం, ఐరన్, ప్రొటీన్లు సమంగా ఆహారంలో ఉండేటట్లు చూసుకోవాలి.


హోమియో చికిత్స:
 

హోమియో చికిత్సావిధానంలో జుట్టు అధికంగా రాలటానికి గల కారణాలు వ్యక్తి లక్షణాలు నిర్థారించే శారీరక మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేసిన మందులతో జుట్టు అధికంగా రాలటాన్ని నిరోధించటమేగాక వాటిస్థానంలో కొత్తగా అభివృద్ధి చెందేలా కూడా చేయవచ్చు. హార్మోన్ల సమస్యలను సరిచేయడంలో కూడా హోమియో మందులు ఎంతగానో ఉపకరిస్తాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top