నడుం నొప్పికి చిన్న చిన్న జాగ్రత్తలు

  •  కుర్చీలో నిటారుగా కూర్చోండి. భుజాలు ముందుకు వాలినట్లుగా ఉండకుండా వెనక్కి ఉండేలా చూసుకోండి.
  •   వీపు పై నుంచి కింద వరకు కుర్చీకి ఆనుకుని ఉండేలా చూసుకోండి.
  •   మోకాళ్ళని సరియైన దిశలో మలుచుకుని ఉంచండి. కాలు పక్కకు వంచి కూర్చోవడం చేయకండి.
  •   మోకాళ్లని హిప్స్ కంటే కొంచెం ఎత్తులో ఉండేలా పెట్టుకుని కూర్చుంటే మరీ మంచిది.
  • ఒకే పొజిషన్‌లో అరగంట కంటే ఎక్కువ సేపు కూర్చోవడం చేయకండి. మధ్య మధ్యలో కాసేపు లేచి నడవండి.
  •   కంప్యూటర్‌పై పనిచేసేటప్పుడు కుర్చీ తగినంత ఎత్తులో ఉండేలా చూసుకోండి.
  •   అధిక బరువు ఉంటే వెంటనే తగ్గించుకోండి.
  •   ప్రతిరోజూ 10 గంటల కంటే ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేయాల్సి వస్తే బ్యాక్ పెయిన్ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top