కావల్సినవి:
బొంబాయి రవ్వ- రెండు కప్పులు, నీళ్లు- కప్పున్నర, ఉల్లిపాయ- ఒకటి, ఉప్పు- రుచికి తగినంత, పంచదార- చిటికెడు, కొత్తిమీర - కొద్దిగా, అల్లం- చిన్నముక్క, పచ్చిమిర్చి- మూడు, గరంమసాలా- అరచెంచా, నెయ్యి- కొద్దిగా.
తయారీ:
ముందుగా ఉల్లిపాయ, కొత్త్తిమీర, పచ్చిమిర్చి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. బొంబాయి రవ్వలో కప్పున్నర నీళ్లు పోసి కుక్కర్లో మూడు కూతలు వచ్చే వరకూ ఉడికించాలి. చల్లారాక అందులో పంచదార, ఉప్పు, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు, అల్లం ముక్కలు, గరంమసాలా వేసి ముద్దగా కలిపి పక్కన పెట్టాలి. అరగంటయ్యాక చిన్నచిన్న ఉండలు చేసి.. కర్రతో చపాతీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు పెనాన్ని పొయ్యి మీద పెట్టి వేడయ్యాక వాటిని నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. వేడివేడి మసాలా రవ్వ రోటీని గ్రీన్ చట్నీతో తింటే మరింత రుచిగా ఉంటుంది.