వెజిటబుల్‌ రోల్స్‌


కావల్సినవి:  
క్యారెట్‌- ఒకటి, బఠాణీలు- అరకప్పు, నూనె- వేయించడానికి సరిపడా, బీన్స్‌- పది, క్యాప్సికం- ఒకటి, పచ్చిమిర్చి- రెండు, మిరియాల పొడి- పావు చెంచా, బ్రెడ్‌ స్త్లెసులు- నాలుగు, ఉల్లిపాయ- ఒకటి, మైదా- కప్పు, మొక్కజొన్న పిండి- అరకప్పు, ఉప్పు- రుచికి తగినంత, పాలు- అరకప్పు.
తయారీ: 
మొదట బీన్స్‌, క్యారెట్‌లను తరుక్కోవాలి. వాటిని, బఠాణీలను కలిపి కుక్కర్‌లో వేసి మూడు కూతలు వచ్చే వరకూ ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో మూడు చెంచాల నూనె పోసి పొయ్యి మీద పెట్టాలి. వేడయ్యాక ఉల్లిపాయ తరుగు, క్యాప్సికం ముక్కలు, పచ్చిమిర్చి వేయించి ఇప్పుడు కూరగాయ ముక్కలు వేయాలి. కొద్దిసేపటికి మిరియాలపొడి, ఉప్పు వేసి రెండు నిమిషాలు ఉంచి దించేయాలి. పాలలో ముంచి తీసిన బ్రెడ్‌ ముక్కలను ఇప్పుడు ఈ కూరకు కలపాలి. మైదాలో మొక్కజొన్న పిండి, ఉప్పు వేసి కాసిని నీళ్లతో చపాతీపిండిలా కలిపి పెట్టుకోవాలి. చిన్నచిన్న ఉండలు చేసి పూరీలు ఒత్తుకొని పెనం మీద కాల్చుకోవాలి. ఇప్పుడు అందులో కూరగాయల స్టఫింగ్‌ పెట్టి రోల్‌లా చుట్టి నూనెలో వేయిస్తే సరిపోతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top