మనసు
బాగోకపోతే.. శారీరకంగానూ బోలెడు ఇబ్బందులు అంటున్నాయి అధ్యయనాలు.
మనసు కలత చెందితే.. శరీరానికి వచ్చిన నష్టమేంటి అనుకోవచ్చు. కానీ కుంగుబాటు,
వ్యాకులతల వల్ల ఎముకలు బలహీనపడిపోతాయని నార్వేకు చెందిన నిపుణులు
అంటున్నారు. తీవ్రమైన కుంగుబాటు వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది.
దాంతో ఎముకల్లో ఉండే క్యాల్షియం సాంద్రత తగ్గిపోయి చిన్నవయసులోనే కీళ్లనొప్పులు,
ఎముకలు గుల్లబారిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే ప్రతి
చిన్న సమస్యనీ భూతద్దంలో పెట్టి చూడకుండా వాటికి వీలైనంత దూరంగా
ఉండాలి. సానుకూలంగా ఆలోచించడం అలవాటు చేసుకోవాలని అంటున్నారు అధ్యయనకర్తలు.
దాంతోపాటు విటమిన్ 'డి' అందే పదార్థాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.
అలాగే బీన్స్, నువ్వులు, బక్రోలీ వంటివాటికి ప్రాధాన్యమివ్వాలి.
వ్యాకులత తగ్గితే.. ఎముకలకు బలం
teluguLifestyle Editor
6:30:00 AM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.