కుకుంబర్ స్క్రబ్
అరకప్పు కీర పేస్ట్, టేబుల్ స్పూన్ పెరుగు, టేబుల్ స్పూన్ తేనెలను బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్ వేసుకుని పది నిమిషాల తర్వాత సున్నితంగా మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. జిడ్డు చర్మం వారికి ఈ స్క్రబ్ మేలు చేస్తుంది.ఆల్మండ్ స్క్రబ్
టేబుల్ స్పూన్ బాదం పొడి, టేబుల్ స్పూన్ తేనె, గుడ్డులోని పచ్చసొన బాగా కలిపి ముఖానికి, మెడకు ప్యాక్ వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత వలయాకారంలో మసాజ్ చేస్తూ గోరువెచ్చని నీటిలో ముంచిన కాటన్‌తో శుభ్రం చేసుకోవాలి. అన్ని చర్మతత్త్వాలకు ఈ స్క్రబ్ మంచి ఫలితాలను ఇస్తుంది.
లెమన్ స్క్రబ్
తేనె, పెరుగు, నిమ్మరసం, బొంబాయిరవ్వ సమపాళ్ళలో తీసుకుని కలపాలి. దీన్ని వేళ్లతో తీసుకుంటూ ముఖానికి పట్టించి సున్నితంగా రుద్దాలి. ఇలా ఐదునిమిషాల పాటు చేసిన తర్వాత టిష్యూ పేపర్‌తో శుభ్రం చేసుకోవాలి.