స్టఫ్డ్...మిరపకాయ


కావలసిన పదార్థాలు: మిరపకాయలు - పది, ఆవాలు - ఒక టేబుల్ స్పూను, మెంతులు - అర టీ స్పూను, సోపు - అర టీ స్పూను, ఆమ్‌చూర్ - అర టీ స్పూను, పసుపు - అర టీ స్పూను, ఉప్పు - తగనంత, నూనె - సరిపడా.

తయారుచేయు విధానం: మిరపకాయలకు మధ్యలో గాటుపెట్టి గింజల్ని తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఆవాలు, మెంతులు, సోంపుని విడివిడిగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. స్టౌ మీద గిన్నె పెట్టి మూడు టీ స్పూన్ల నూనె పోసి పూర్తిగా కాచి దించేయాలి. పూర్తిగా చల్లారాక ఇందులో ఆవాలు, మెంతులు, సోంపు, ఆమ్‌చూర్ వేసి బాగా కలపాలి. కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మిరపకాయల మధ్యలో పెట్టాలి. ఇప్పుడు స్టౌ మీద మరో గిన్నె పెట్టి రెండు టీ స్పూన్ల నూనె పోసి బాగా కాగాక ఈ మిరపకాయల్ని వేసి వేగించితీసేయాలి. వీటిని పప్పు అన్నంతో నంజుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top