మొక్కజొన్న(కార్న్‌) కూర


కావల్సినవి: 
లేత మొక్కజొన్న గింజలు- కప్పు, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - రెండు, మైదా పిండి - రెండు చెంచాలు, అల్లం వెల్లుల్లి ముద్ద- చెంచా, పాలు - కప్పు, క్రీమ్‌ - రెండు చెంచాలు, పసుపు - చెంచా, ఉప్పు, కారం - తగినంత, జీలకర్ర, ధనియాల పొడి- చెంచా చొప్పున, నూనె - రెండు చెంచాలు. 
తయారీ: 
బాణలిలో నూనె పొసి పొయ్యి మీద పెట్టాలి. వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. తరవాత అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి ముక్కలు, మొక్కజొన్న గింజలు చేర్చి వేయించాలి. కొద్దిసేపటికి పసుపు,తగినంత ఉప్పు, కారం కలపాలి. మొక్కజొన్న గింజలు వేగే వరకూ వేయించాలి. ఆ తరవాత మైదా పిండి చల్లి, పాలు కూడా పోసి మూత పెట్టాలి. గింజలు మెత్తగా ఉడికాక ధనియాలపొడి, జీలకర్ర పొడి చల్లి కలియతిప్పాలి. చివరిగా క్రీమ్‌ వేసి దించేస్తే కార్న్‌ కూర సిద్ధమయినట్టే. ఇది పూరీల్లోకి బాగుంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top