కావల్సినవి:
పాలకూర తరుగు - రెండు కప్పులు, తోటకూర తరుగు - కప్పు, బచ్చలికూర తరుగు - కప్పు, పుదీనా తరుగు - అరకప్పు, కొత్తిమీర తరుగు - కప్పు, పొన్నగంటి ఆకు - అరకప్పు, కరివేపాకు తరుగు - పావుకప్పు, సెనగపిండి - మూడుకప్పులు పచ్చిమిర్చి - ఐదు (పొడుగ్గా తరగాలి), ఉల్లిపాయలు - మూడు (పొడుగ్గా తరగాలి), వాము - పావుచెంచా, ఉప్పు - రుచికి తగినంత, మెంతికూర తరుగు - పావుకప్పు, నూనె - వేయించడానికి సరిపడా.
తయారీ:
తరిగిన ఆకుకూరలన్నింటినీ శుభ్రంగా కడిగి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ చేర్చి నీళ్లతో పకోడి పిండిలా కలిపి పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించి బాణలిలో నూనె వేడిచేయాలి. అందులోంచి చెంచా నూనె తీసుకుని పకోడీ పిండికి చేర్చి మరోసారి కలిపి నూనెలో పకోడీల్లా వేసుకోవాలి. బంగారువర్ణంలోకి వచ్చాక తీసేస్తే చాలు. వేడివేడి పోషకాల పకోడి టీతో పాటు తీసుకోవడానికి సిద్ధం.