కావల్సినవి:
జీడిపప్పు- యాభైగ్రాములు, దొండకాయలు- పావుకేజీ, ఉల్లిపాయలు- రెండు, టమాటా- ఒకటి, అల్లంవెల్లుల్లి ముద్ద- చెంచా, నూనె- తగినంత, ఉప్పు, కారం- తగినంత, జీలకర్ర, షాజీరా- అరచెంచా, కసూరీమేతి- కొద్దిగా, లవంగాలు- రెండు, దాల్చినచెక్క- చిన్నముక్క, పసుపు- చిటికెడు.
తయారీ:
దొండకాయలను శుభ్రంగా కడిగి నాలుగు ముక్కలుగా కోసి నూనెలో వేయించి పెట్టుకోవాలి. తరవాత టమాటా, ఉల్లిపాయ ముక్కలను ముద్దగా చేసుకోవాలి. అలానే జీడిపప్పులో నీళ్లు కలిపి రుబ్బుకోవాలి. మరో బాణలిలో నూనె వేసి వేడి చేసుకొని కసూరీమేతి, లవంగాలు, దాల్చినచెక్క, జీలకర్ర, షాజీరా, పసుపు, ఉల్లిపాయ ముద్ద వేసి మగ్గించాలి. కొద్దిసేపటికి జీడిపప్పు ముద్ద వేసి పచ్చివాసన పోయాక ఉప్పు, కారం వేసి మూతపెట్టాలి. నాలుగైదు నిమిషాలయ్యాక దొండకాయ ముక్కలు చేర్చి కలియ తిప్పి కొత్తిమీరతో అలంకరిస్తే కూర సిద్ధమయినట్టే.