పొడి చర్మం బాధిస్తుంటే......ఈ ప్యాక్ ట్రై చేయండి

గుడ్డులోని తెల్లసొన, టీ స్పూన్ తేనె, టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు ప్యాక్‌లా వేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. గుడ్డులోని ప్రొటీన్ చర్మాన్ని పొడిబారనీయకుండా చేస్తుంది. తేనెలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజలవణాలు చర్మపోషణకు ఉపయోగపడతాయి. రోజ్‌వాటర్ చర్మానికి తాజాదనం తెస్తుంది.
Share on Google Plus