ఈమధ్యకాలంలో ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య మెడనొప్పి.ఆ మెడ నొప్పికి హోమియో చికిత్స

ఈమధ్యకాలంలో ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య మెడనొప్పి. పురుషులతో పోల్చితే స్త్రీలలో ఈ సమస్య కాస్త ఎక్కువగానే ఉంటోంది. ముఖ్యంగా నగరాల్లో నివసించే వారు దీని బారినపడుతున్నారు. పెరుగుతున్న పని ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, గంటల తరబడి కూర్చుని పనిచేయడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.

మెడ భాగంలో వచ్చే ఈ నొప్పిని సెర్వికల్ స్పాండిలైటిస్ అంటారు. డిస్క్‌ల్లో తేడా రావడం, కండరాలు బిగుసుకుపోయినట్లుగా తయారవడం దీని ప్రధాన లక్షణం. మెదడు, వెన్నుపూస నుంచి శరీరానికి సరఫరా అయ్యే ముఖ్యమైన నరాలు మెడ ఎముక ద్వారా సరఫరా అవుతుంటాయి. ఏదైనా కారణం వల్ల ఈ మెడ నరాలపైన ఒత్తిడి పెరిగినపుడు మెడ నొప్పి మొదలవుతుంది. నిర్లక్ష్యం చేస్తే కండరాలు, రక్తనాళాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.


ఎవరిలో ఎక్కువ
గంటల తరబడి కంప్యూటర్‌ల ముందు కూర్చుని పనిచేసే వారిలో ఈ సెర్వికల్ స్పాండిలోసిస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాల్ సెంటర్లలో పనిచేసే వారిలో, సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ ఎక్కువగా ఈ వ్యాధి బారినపడుతుంటారు. ద్విచక్రవాహనం ఎక్కువగా నడిపే వారిలోనూ ఈ నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. అధిక బరువు మోసే వారిలోనూ ఈ వ్యాధి అరుదుగా కనిపిస్తుంది.

కారణాలు
వయసు పెరుగుతున్న కొద్దీ బయటపడే ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ ఇటీవలి కాలంలో మధ్యవయస్కుల్లోనూ కనిపిస్తోంది. ఏఔఅఆ జన్యువులలో వచ్చిన మార్పుల ప్రభావం వల్ల ఈ సమస్య వస్తోందని ఒక అధ్యయనంలో వెల్లడయింది. కొంతమందిలో మెడ ఎముకల్లో అసాధారణ పెరుగుదల చోటుచేసుకోవడం వల్ల, గాయాల వల్ల స్పాండిలైటిస్ మొదలవుతుంది.

లక్షణాలు

తల, మెడ నొప్పితో కండరాలు బిగుసుకొనిపోతాయి. మెడ నుంచి భుజాలు, చేతులకు నొప్పి, తిమ్మిర్లు వ్యాపిస్తాయి. చేతి కండరాలు బలహీనపడటం, కళ్లు తిరగడం, భుజాలు, చేతి వేళ్లలో స్పర్శ తగ్గిపోవడం, అరుదుగా మూత్రవిసర్జనపై నియంత్రణ కోల్పోవడం జరుగుతుంది. నిద్రలేమి, మానసిక ఒత్తిడి ఉంటుంది. మెడ బిగుసుకుపోయినట్లుగా కావడంతో నొప్పి ప్రారంభమవుతుంది. నొప్పి క్రమంగా భుజాలకు పాకుతుంది. తలను కదల్చలేకపోతారు. తీవ్రమైన ఒత్తిడిపడుతున్నట్లుగా ఉంటుంది. చెవుల్లో శబ్దాలు వస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. తలనొప్పి, బీపీ పెరిగిపోవడం జరుగుతుంది. నొప్పి క్రమంగా చేతులకు విస్తరిస్తుంది.

నిరక్ష్యం చేస్తే...
సర్వైకల్ స్పాండిలైటిస్‌ను నిర్లక్ష్యం చేస్తే ఇతర సమస్యలు మొదలయ్యే అవకాశంఉంది. దీర్ఘకాలిక మెడ నొప్పి, మల, మూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోవడం, కండరాలు పటుత్వాన్ని కోల్పోవడం వంటి సమస్యలు మొదలవుతాయి.

గుర్తించడం
ఎక్స్‌రే, ఎమ్ఆర్ఐ స్కాన్, సిటి స్కాన్ వంటి పరీక్షల ద్వారా సర్వైకల్ స్పాండిలోసిస్‌ను గుర్తించవచ్చు. కండరాలకు సంబంధించిన లక్షణాలు ఉన్నప్పుడు , మైలోగ్రామ్ మరియు ఇ.ఎమ్.జి వంటి పరీక్షల ద్వారా జరిగిన నష్టాన్ని అంచనా వేయవచ్చు. నిపుణులైన వైద్యులు రోగిని పరీక్షించడం ద్వారా వ్యాధిని సులభంగా గుర్తిస్తారు.
 

నివారణ
చదువుతున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు సరియైన భంగిమలో కూర్చోవాలి. ఎక్కువ సమయం చదువుతుండే పిల్లలను గంటకొకసారి నిలబడమనడం, కాసేపు పచార్లు చేయించడం వల్ల స్పాండిలైటిస్ రాకుండా చూసుకోవచ్చు. పిల్లలు గంటలతరబడి కంప్యూటర్ గేమ్స్ ఆడకుండా నియంత్రించాలి. నిద్రపోయే సమయంలో తల కింద అనువైన దిండు పెట్టుకోవాలి. క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. మానసిక ఆందోళన లేకుండా ప్రశాంత జీవనం గడపాలి.

హోమియో చికిత్స
సర్వైకల్ స్పాండిలైటిస్‌కు హోమియో వైద్య విధానంలో చక్కని చికిత్స అందుబాటులోఉంది. హోమియో మందుల ద్వారా మెడనొప్పిని పూర్తిగా దూరం చేయవచ్చు. ఈ విధానంలో రోగి శారీరక, మానసిక పరిస్థితిని అంచనావేసి, లక్షణాలు పరిశీలించి చికిత్స అందించడం జరుగుతుంది. వ్యాధి మూల కారణాన్నితగ్గించేందుకు మందులను ఇవ్వడం జరుగుతుంది. నిపుణులైన హోమియో వైద్యులపర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే ఫలితం బాగుంటుంది. మందులతోపాటు క్రమంతప్పకుండా వ్యాయామం చేస్తే సమస్య పూర్తిగా తగ్గిపోతుంది.
 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top