కష్టతరమైన బైపాస్ సర్జరీ స్థానంలో సునాయాసంగా చేసే వీలున్న యాంజియో ప్లాస్టీ చికిత్సా విధానం


కష్టతరమైన బైపాస్ సర్జరీ స్థానంలో సునాయాసంగా చేసే వీలున్న యాంజియో ప్లాస్టీ చికిత్సా విధానం రాక హృద్రోగుల పాలిట వరం. ఈ విధానంలో గుండె రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును బెలూన్ సహాయంతో పక్కకు తొలగించి అక్కడ రక్తసరఫరా సజావుగా సాగేలా చేసేందుకు వీలయ్యేలా స్టెంట్‌లు అమరుస్తారు. ప్రస్తుతం పలు ఆధునాతన స్టెంట్‌లు అందుబాటులోకి వచ్చాయి. స్టెంట్‌లు ఎలా అమరుస్తారు? అధునాతన స్టెంట్ల వల్ల ప్రయోజనం.

మధుమేహం, అధిక రక్తపోటు, ధూమపానం, కొరవడిన వ్యాయామం, వంశపారంపర్యంగా ఇలా పలు కారణాల వల్ల గుండె రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి రక్త సరఫరాకు ఆటంకం వాటిల్లుతున్నది. రైట్ కరోనరీ ఆట్రీ (ఆర్‌సీఏ), లెఫ్ట్ యాంటిరియర్ డిసెడింగ్ ఆట్రీ ( ఎల్ఏడీ), లెఫ్ట్‌నర్ కంప్లెక్స్ ఆట్రీలలో కొవ్వు అడ్డు పడటం వల్ల ఆయా రక్తనాళాల్లో రక్తం సరఫరాకు ఇబ్బందులు ఏర్పడతాయి. దీనివల్ల గుండెపోటు వస్తుంది. ఇలాంటి సమయంలో రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును పక్కకు తొలగిస్తూ స్టెంట్‌లు అమరుస్తారు. చేయి లేదా కాలి వద్ద ఉన్న రక్తనాళానికి నీడిల్ ద్వారా రెండు మిల్లీమీటర్ల చిన్న రంథ్రం చేసి, దానినుంచి బెలూన్ సహాయంతో కొవ్వు పేరుకుపోయి బ్లాక్ అయిన రక్తనాళం వద్ద స్టెంట్‌ను అమరుస్తారు. దీంతో రక్త సరఫరా పాఫీగా సాగి గుండెపోటు సమస్య నుంచి బయటపడవచ్చు.

అధునాతన స్టెంట్‌లలో పునర్జన్మ
స్టెంట్‌లలో మందు పూత లేనివాటిని బేర్‌మెటల్ స్టెంట్‌లు అంటారు. ఇందులో స్టెయిన్‌లెస్ స్టీల్, కోబాల్ట్ క్రోమియం, ప్లాటినం కోబాల్ట్ క్రోమియం బేస్‌వి ఉన్నాయి. మందుపూతతో ఉన్న స్టెంట్‌లను పాలిమర్ ఫ్రీ మెడికేటెడ్ స్టెంట్‌లు వచ్చాయి. రక్తనాళంలో మొదట, మధ్యలో, చివర ఎక్కడ బ్లాక్ అయింది? ఎంత పొడవు కొవ్వు పేరుకుపోయిందనే అంశాలను కూడా కార్డియాలజిస్టులు పరిగణనలోకి తీసుకుంటారు. గతంలో రోగికి బెలూన్ సహాయంతో పేరుకున్న కొవ్వును రక్తనాళం పక్క గోడలకు పోయేలా చేసి బ్లాక్స్‌ను తొలగించేవారు. దీనివల్ల మళ్లీ రక్తనాళంలో కొవ్వు చేరి బ్లాక్ ఏర్పడేది.

దీంతో రక్తనాళంలో మళ్లీ కొవ్వు పేరుకుపోకుండా స్ప్రింగు లాగా స్టెంట్‌ను అమరుస్తున్నారు. దీన్ని అమర్చిన రక్తనాళంలో రక్తం గడ్డకట్టే అవకాశముంది. అలా రక్తనాళంలో రక్తం గడ్డకట్టి అడ్డుపడకుండా ఉండేందుకు వివిధ రకాల మందుపూత ఉన్న స్టెంట్‌లను అమర్చే విధానం అందుబాటులోకి వచ్చింది. స్టెంట్‌పై పూసిన మందును విడుదల చేస్తూ రక్తనాళంలో రక్తం గడ్డ కట్టకుండా నిరోధిస్తుంది. దీనివల్ల ఒక సారి స్టెంట్ వేయించుకున్న హృద్రోగికి మళ్లీ అక్కడ రక్తం గడ్డ కట్టి రక్త సరఫరా బ్లాక్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇటీవల హృద్రోగులకు వీటి వాడకం గణనీయంగా పెరిగింది.

ఎవరోలిమస్ ఎల్యూటింగ్ స్టెంట్ :

రక్తనాళంలో ఈ స్టెంట్ అమర్చిన తర్వాత నెలరోజుల పాటు ఎవరోలిమస్ అనే మందును విడుదల చేస్తుంది. ఈ మందు రక్తనాళంలో మళ్లీ కొవ్వుతోపాటు రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతుంది. మందు పూత ఉన్న ఈ స్టెంట్ కోబాల్ట్ క్రోమియం లేదా ప్లాటినం కోబాల్ట్ క్రోమియం బేస్‌తో కూడా లభిస్తున్నాయి. ఇది అమర్చిన రోగికి మళ్లీ భవిష్యత్‌లో జబ్బు వచ్చే అవకాశం తక్కువ. దీని వల్ల గుండె రక్తనాళంలో ఎర్రగా పచ్చిగా ఉన్నందున కార్డియాలజిస్ట్ సలహాపై ఎక్కువ రోజులు నిర్దేశించిన మందులు వాడాలి. ఎవరోలిమస్ ప్లాటినం కోబాల్ట్ క్రోమియం స్టెంట్: ఇది ప్లాటినం కోబాల్ట్ క్రోమియం బేస్‌తో కూడింది. ఈ స్టెంట్‌ను రోగికి మెలికలు తిరిగిన రక్తనాళాల్లో సులభంగా అమర్చవచ్చు.

పాలిమర్ ఫ్రీ డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్:
ఈ స్టెంట్‌లో పాలిమర్ లేకపోవటం వల్ల రక్తనాళంలో మూడు నెలల పాటు పచ్చితనం ఉంటుంది. దీని వల్ల రక్తనాళంలో రక్తం గడ్డ కట్టే అవకాశాలు తక్కువ. దీనికితోడు సిరోలిమస్ ఎల్యూటింగ్ స్టెంట్‌లు, ఫ్యాక్లీటాక్సిల్ ఎల్యూటింగ్ స్టెంట్‌లు కోబాల్ట్ క్రోమియం, స్టెయిన్‌లెస్ స్టీల్ బేస్‌తో తయారైనవి అందుబాటులో ఉన్నాయి. బయోడిగ్రేడబుల్ స్టెంట్ : మెగ్నీషీయంత ో తయారయ్యే ఈ స్టెంట్‌ను ఇటీవల వైద్యనిపుణులు కనుగొన్నారు. ఇది రక్తనాళంలో అమర్చిన తర్వాత రక్తనాళంలో పేరుకున్న కొవ్వును తొలగించిన తర్వాత రక్తనాళంలోనే కరిగిపోతుంది. ఇది ప్రస్తుతం పరీక్షల దశలో ఉంది. త్వరలో రోగులకు అందుబాటులో వచ్చే అవకాశముంది.
 

అపోహలొద్దు
స్టెంట్‌లపై రోగులకు పలు రకాల అపోహలున్నాయి. ఒక సారి రక్తనాళంలో అమర్చిన తర్వాత స్టెంట్ జరగదని రోగులు గుర్తించాలి. దీన్ని అమర్చడం ఒక సులభమైన ప్రోసిజర్ తప్ప ఇది ఆపరేషన్ కాదు. ఈ స్టెంట్‌లు రక్తనాళంలో తుప్పు పడుతుందనేవి కేవలం అపోహ మాత్రమే. ఇవి అమర్చిన తర్వాత రోగి వెంటనే సాధారణ పనులు సైతం చేసుకోవచ్చు. సెక్సులోనూ పాల్గొనవచ్చు.

టాబ్లెట్స్ మానొద్దు
స్టెంట్ అమర్చుకున్న రోగి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా, భూకంపం వచ్చినా ఆగకుండా రక్తనాళాల్లోని రక్తం పలుచ బడటానికి కార్డియాలజిస్ట్ నిర్దేశించిన ఆస్పిరిన్, క్లోపిడోగ్రల్ మందులను వాడాలి. ఊతినే ఆహారపదార్థాల్లో ఆయిల్ తక్కువ ఉండేలా చూసుకోవాలి. వేపుళ్లకు దూరంగా ఉండాలి.

అధిక రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఊమద్యం, ధూమపానం మానివేయాలి. 


ప్రతీరోజూ నడక లేదా వ్యాయామం తప్పనిసరి. 



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top