కావలసినవి
గోధుమపిండి: అరకిలో, పాలు: కప్పు, కోడిగుడ్లు: రెండు, పెరుగు: పావుకప్పు, నీళ్లు: సరిపడా, వెల్లుల్లితురుము: 4 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: సరిపడా, నూనె: తగినంత, ఈస్ట్: టేబుల్‌స్పూను.
తయారుచేసే విధానం
వెడల్పాటి గిన్నెలో ఈస్ట్ వేసి గోరువెచ్చని నీళ్లు పోసి పదినిమిషాలు ఉంచితే అది కరుగుతుంది. ఇప్పుడు అందులో గోధుమపిండి, పాలు, కోడిగుడ్లు, పెరుగు, ఉప్పు వేసి పది నిమిషాలపాటు మెత్తని పిండిలా కలపాలి. ఇప్పుడు ఈ పిండిని నూనె రాసిన గిన్నెలో పెట్టి తడిబట్ట కప్పి ఒక గంట పక్కన ఉంచాలి. పిండి రెండింతలు అవుతుంది.
ఇప్పుడు దీన్ని ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండను వెల్లుల్లి మిశ్రమంలో దొర్లించి నాన్లా చేసుకుని నూనె వేస్తూ కాల్చి తీయాలి. ఇష్టమైతే వెన్నతో కాల్చుకోవచ్చు. లేదా కాల్చిన తరవాత కాస్త వెన్న రాస్తే సరి.