కాస్త ప్లానింగ్ ఉంటే మజానే మజా!

ఉద్యోగులే కాదు చదువుకునే పిల్లలు ఉన్న కుటుంబాల్లోని వారందరూ వారాంతం కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. మిగిలిన రోజుల్లో ఉద్యోగులు బిజీగా ఉంటారు.ఊపిరి తీసుకునే తీరిక ఉండదు.

చదువుకునే పిల్లలు ఉన్న ఇళ్లలో కూడా ఇదే పరిస్థితి. స్కూళ్లు, హోమ్‌వర్క్‌లతో వాళ్లు బిజీగా ఉంటే వారికి సేవలు చేయటంలో తల్లులు బిజీగా ఉంటారు. వీరందరికీ ఆదివారమే ఆటవిడుపు. సండే వచ్చే వరకు ఎదురు చూస్తూ గడిపి, సరైన ప్లానింగ్ లేక సండేను కూడా సరిగా ఎంజాయ్ చేయక నిరుత్సాహపడే వారిని చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. ఆదివారాన్ని గుండెల నిండుగా ఎంజాయ్ చేసేందుకు టిప్స్ అందిస్తున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.



ఆదివారం నాడు ఎక్కడికి వెళ్లాలి? ఎలా వెళ్లాలి? అనే విషయాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలి.


  • బంధువుల ఇళ్లకు వెళ్లేట్లయితే వారికి ముందుగానే ఫోన్ చేసి చెప్పడం వల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది.
  • కుటుంబ సభ్యులతోనే పిక్నిక్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే అందుకు కావలసిన ఏర్పాట్లు ముందుగానే చూసుకోండి.
  • సోమవారం ఎటువంటి పనులు ఉన్నాయనే అంశం ఆధారంగా ఆదివారం ఎటువంటి ప్రోగ్రాం ప్లాన్ చేసుకోవాలో ముందుగానే నిర్ధారించుకోవాలి. లేకపోతే ఆపై వారం అంతా గందరగోళం అయిపోతుంది.
  • ఒకటే రోజున ఒకటికి నాలుగు కార్యక్రమాలు పెట్టుకోవడం వల్ల హడావుడి తప్ప ఆనందం ఉండదు. కాబట్టి సింపుల్‌గా ఒకటి లేదా రెండు కార్యక్రమాలు ప్లాన్ చేసుకుంటే ఆనందం మీ సొంతం అవుతుంది.
  • మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఎక్కువ సేపు గడిపే రోజు కూడా ఇదే. వారి ఆలోచనలను, భావోద్వేగాల్ని గమనించేందుకు వీలయిన ప్రోగ్రాంలను నెలలో రెండు రోజులైనా ప్లాన్ చేసుకోండి.
  • మీతో గడిపే క్షణాలు పిల్లలకు పెద దబాల శిక్ష వంటివి. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. పుస్తకాల కంటే మీ ప్రవర్తన, మాట తీరు, సమస్యలను అధిగమించేందుకు మీరు ఉపయోగించే మార్గాల నుంచి వారు ఎక్కువ నేర్చుకుంటారు. సో... సండేని చక్కగా ప్లాన్ చేసుకుని, ఆనందాన్ని మీ సొంతం చేసుకోండి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top