ఉదయాన్నే పుష్టికరమైన అల్పాహారం తీసుకుంటే రోజంతా ఉల్లాసంగా ఉండే వీలుంటుందంటున్నారు పౌష్టికాహార నిపుణులు. మధ్యాహ్న భోజనం సరిగా తినకపోయినా ఓ.కె. కానీ ఉదయం అల్పాహారాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయవద్దనేది వారి సలహా. అందుకే మన పెద్దలు అనే వారు ఉదయం పూట రాజులా తినాలి. మధ్యాహ్న భోజనం మధ్యస్థంగా తీసుకోవాలి. రాత్రి భోజనం నిరుపేదలా తినాలని. ఇలా తింటే ఆరోగ్యం మన సొంతం అవుతుంది. ఉదయం మంచి అల్పాహారం తీసుకోమంటారు... తిందామంటే ఇడ్లీలు, దోసెలు, పుల్కాలు తప్ప ఏమున్నాయి టిఫిన్‌లోకి అని మీరు అనవచ్చు. అందుకే పసందైన అల్పాహారం చిట్కాలు మీ కోసం...
- ఓట్స్ ఉప్మా, లేదా పాలల్లో ఓట్స్ వేసుకుని తీసుకోవచ్చు. లేదా పాలతో కార్న్‌ఫ్లేక్స్ తీసుకుంటే శరీరానికి అవసరమైన ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది.
- ఉదయాన్నే టిఫిన్‌లో భాగంగా రాగి జావ తీసుకోవడం ఉత్తమం.
- అల్పాహారంలో తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్ తప్పని సరిగా ఉండేలా చూసుకోండి.
- కోడిగుడ్డు అది కూడా ఉడికించిన కోడి గుడ్డు రోజుకు ఒకటి అల్పాహారంలో తీసుకోవాలి.
- సోయాపాలు ఆరోగ్యానికి చాలా మంచివి. మనం తీసుకునే పాల స్థానంలో వారంలో రెండు మూడు రోజులైనా సోయా పాలు తీసుకోవాలి. జివారంలో ఒక రోజయినా పూరీని అల్పాహారంగా తీసుకోండి. ముఖ్యంగా చిన్న పిల్లలకు పూరీలు, వెజిటబుల్ కర్రీ మంచి ఆహారం.
- ఉదయం పుల్కాలు తినే వారు అందులోకి తాజా కూరగాయలతో పాటు చిరుధాన్యాలతో ఒక కూర చేసుకుంటే శరీరానికి తగిన శక్తి వస్తుంది.