బీపీ వ్యాధిగ్రస్తులు ముఖ్యంగా హై బీపీ వచ్చి, నియంత్రణలోకి వచ్చిన తర్వాత 90 నుంచి 95 శాతం వరకు జీవితాంతం మందులు తీసుకోవడం అవసరం. ట్యాబ్లెట్లు తీసుకోవడం ఆపితే ఈ సమస్య మళ్లీ ఎక్కువ కావచ్చు. కాని డాక్టర్ సలహా మేరకు రెగ్యులర్గా మందులు వాడితే కొందరిలో వీటి మోతాదు తగ్గించడానికి వీలు అవుతుంది. మందులు మధ్యలో మానివేయటం వల్ల బీపీ అధికమై పక్షవాతం లాంటి ప్రమాదాలు సంభవించడానికి ఆస్కారం ఉంది. కనుక డాక్టర్ సలహాలు పాటిస్తూ మందులను క్రమం తప్పకుండా వాడటం మంచిది. ఒకవేళ రెండు మూడు రకాల మందులు వాడినా బీపీ నియంత్రణలోకి రాని పక్షంలో ఈ మధ్య కొత్తగా రీనల్ డినర్వేషన్ థెరపీ అనే ప్రత్యేక చికిత్స ద్వారా ఎంతటి హై బీపీని అయినా నియంత్రించి రోగికి భవిష్యత్తులో వచ్చే హార్ట్ఎటాక్, పక్షవాతం, కిడ్నీల పనితీరు దెబ్బతినడం వంటి వాటిని నివారించే అవకాశం ఉంది.
బి.పి ఉంటే జీవితాంతం మందులు వాడాలా?
teluguLifestyle Editor
4:30:00 AM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.