చలికాలంలో వాకింగ్‌కు డుమ్మా కొట్టిన వారు ఎలాంటి ఎక్సర్‌సైజ్‌లు చేయాలి?

దీపావళి వెళ్లిపోయింది. కార్తీకమాసం వచ్చేసింది. మెల్లిగా చలి మొదలైంది. సూర్యుడు కనిపిస్తే కానీ మంచి మీద నుంచి లేవాలనిపించదు. చలికాలంలో అన్నిటికంటే ముందు వ్యాయామం పడకేస్తుంది. మార్నింగ్ వాక్‌కు వెళదామంటే చల్లటి వాతావరణం, మరి కొన్ని రోజులు పోతే ఉదయం 7 గంటల వరకు మంచు పడుతునే ఉంటుంది. పైగా ఆస్తమా, సైనస్ సమస్యలున్న వారు ఈ సీజన్‌లో ఉదయాన్నే లేచి, ఆ చల్లటి వాతావరణంలో తిరగడం అంత మంచి కాదంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? చలికాలంలో వాకింగ్‌కు డుమ్మా కొట్టిన వారు ఎలాంటి ఎక్సర్‌సైజ్‌లు చేయాలో చూద్దాం.

  • వాకింగ్‌కు డుమ్మా కొట్టినా ఇంట్లోనే ఓ అరగంట యోగాసనాలు వేయండి. ఉదయం బదులు సాయంత్రం వాకింగ్ చేయండి.
  • బట్టల స్టాండ్‌గా ఉపయోగిస్తున్న థ్రెడ్‌మిల్‌ను ఈ సీజన్‌లో బయటకు తీయాల్సిందే. చలిలో ఎలాగూ బయటకు వెళ్లలేరు కాబట్టి, ఉదయాన్నే ఓ అరగంట థ్రెడ్ మిల్ మీద పరిగెడితే రోజంతా ఉల్లాసంగా ఉంటుంది.
  •  ప్రాణాయామం, కపాలభాతి వంటి శ్వాసపరమైన వ్యాయామాలు ఈ సీజన్‌లో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
  •   ఇవేమీ కుదరని వారు 7 గంటలకయినా ఓ అరగంట ఇంటికి ఎదురుగా ఉన్న పార్క్‌లో ఆటూ ఇటూ నడిస్తే సరిపోతుంది.
  • ఇబ్బంది ఉంటే ఓకే కానీ మంచు పడుతున్నా సరే ఉదయాన్నే వాకింగ్‌ను వీలయినంత వరకు కొనసాగించాలి. మార్నింగ్ వాక్ చేస్తే రోజంతా చైతన్యంతో తొణికిసలాడటం ఖాయం. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top