సందర్భానుసారంగా డ్రెసింగ్ ఉండాలంటారు కదా! అంటే ఏంటి? ఏ సందర్భానికి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి?

సందర్భానుసారంగా దుస్తులు ధరించకపోతే అది సెన్సాఫ్ డ్రెసింగ్ అనిపించుకోదు. ఉదా: కార్పొరేట్ మీటింగ్‌కి బాగా మెరిసే ఎంబ్రాయిడరీ చీర కట్టుకెళితే ఎలా ఉంటుంది? అలాగే ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులు పెళ్లికి వెళ్లినట్టుగా తయారవడం కూడా బాగోదు. ఉద్యోగులు తప్పనిసరిగా ఫార్మల్ వేర్‌నే ధరించాలి. అయితే క్యాజువల్ వేర్‌కి ఫార్మల్‌వేర్‌కి తేడాలు తెలుసుండాలి. ఫార్మల్ వేర్‌గా సల్వార్ కమీజ్, చీర ధరించడం మన స్టైల్. అదే... నీ-లెంత్, ఫుల్ లెంత్, ‘ఎ’లైన్ స్కర్ట్స్, ట్రౌజర్స్, షర్ట్స్, బ్లేజర్స్, వెయిస్ట్ కోట్స్... ఇవన్నీ కార్పొరేట్ ఫార్మల్ వేర్ కు సూటవుతాయి. కలర్స్ విషయానికి వస్తే- ఉద్యోగులు ధరించే దుస్తుల రంగులు కొట్టొచ్చినట్టుగా ఉండకూడదు. ఎప్పుడైనా వీరు లైట్ కలర్స్‌నే ఎంచుకోవాలి. ఇండియన్ ఫార్మల్ వేర్‌కైనా, కార్పోరేట్ ఫార్మల్ వేర్‌కైనా లైట్ పేస్టల్ కలర్స్ వాడాలి. ఎంబ్రాయిడరీ, ప్యాచ్‌వర్క్ చేసినవి ఆఫీస్‌వేర్‌కి ఎంతమాత్రం పనికిరావు. ఇక క్యాజువల్ వేర్ అంటే షాపింగ్‌కో, సినిమాలకో, ఎవరింటికైనా వెళ్లాల్సి వస్తేనో.. జీన్స్, టీ షర్ట్‌లు, ఫ్లెయిర్ ఉన్న స్కర్ట్‌లు.. ఇలాంటివన్నీ నప్పుతాయి. పార్టీలకైతే కొంచెం బ్రైట్ కలర్స్, ఫుల్ ఎంబ్రాయిడరీ, షిమ్మర్, సిల్క్ ఫ్యాబ్రిక్స్.. ఆ పార్టీకి తగ్గట్టుగా ధరించాలి. అఫీషియల్ పార్టీస్‌కి (పెళ్లి, న్యూ ఇయర్ పార్టీస్ లాంటివి) మాత్రం తప్పనిసరిగా ఫార్మల్ వేర్‌నే ధరించాలి. పార్టీలలో జీన్స్, టీ షర్ట్స్ ధరించడం బాగోదు. వెస్ట్రన్ పార్టీకైతే ఫార్మల్‌వేర్‌గా నీ-లెంత్, ఫుల్ లెంత్ గౌన్‌లు ధరించవచ్చు. పగలు పార్టీ అయితే బ్రైట్ కలర్స్ వాడకూడదు. డార్క్ కలర్స్, మీడియమ్ కలర్స్‌ను ఎంచుకోవచ్చు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top