అందానికి ప్రతీకగా నిలిచే పెదవులను చలికాలంలో ఎలా సంరక్షించుకోవాలో చిట్కాలు

చలికాలం ఆరంభంతో సున్నితమైన పెదవుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి.  మాట్లాడేటపుడు, నవ్వేటపుడు కీలకంగా కనిపించే పెదవులు చలికాలంలో పొడిబారకుండా, పగుళ్లు ఏర్పడకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలి. అందానికి ప్రతీకగా నిలిచే పెదవులను చలికాలంలో ఎలా సంరక్షించుకోవాలో  చిట్కాలు మీ కోసం...

*మీ పెదవులకు రోజుకు కనీసం మూడు సార్లు నాణ్యమైన పెట్రోలియం జెల్లీని పూసుకుంటే మంచిది.

*పెదవులు సున్నితంగా, మృదువుగా ఉండాలంటే పడుకోబోయే ముందు వెన్నతో మర్దన చేస్తే ఫలితం ఉంటుంది.
*కెమికల్స్‌తో కూడిన జెల్లీల కంటే హెర్బల్ మాయిశ్చరైజింగ్ లోషన్స్ వాడితే పెదవులు మృదువుగా తయారవుతాయి.
*ప్రకృతిసిద్ధంగా లభించే వెన్న, నెయ్యి, మిల్క్‌క్రీమ్‌లతో మసాజ్ చేస్తే పెదవులు మరింత అందంగా కనిపిస్తాయి.
*రాత్రివేళ పడుకోబోయే ముందు బొప్పాయి పేస్ట్ పూసి పదినిమిషాల పాటు మసాజ్ చేస్తే మీ పెదవులు మరింత ప్రకాశవంతంగా మారతాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top