‘ఉప్పు’హోటల్‌ ని మీరు ఎప్పుడైనా చూసారా.... అయితే చూడండి

జానపద కథల్లో చదివిన జ్ఞాపకం. ఏవేవో ఊహల లోకం ఉన్నట్టు.. అక్కడ అన్నీ చాక్లెట్లతో కట్టిన ఇళ్లున్నట్టు.. నీలాకాశంలోని నీలినీలి మబ్బులు నీలి ముంగురుల్ని తాకుతూ చల్లదనాన్ని పంచుతున్నట్టు.. ఒకటేమిటి? ఎనె్నన్నో అనుభూతుల కుప్పలు. ఇది ఇహలోక వ్యవహారం కాదు - కల్పిత గాథల కలలు. కానీ - బొలీవియాకి అతి సమీపంలోని కొల్చానీ ప్రాంతంలో ‘హోటల్ డె సాల్’కి వెళ్తే - అచ్చంగా అటువంటి ప్రపంచం కనిపిస్తుంది. కాకపోతే ‘ఉప్పు లేందే ఏ కూరకీ రుచి రాదన్న’ నానుడిని ఇక్కడ గోడలకి అన్వయించి - ఆ హోటల్‌ని సముద్ర తీరాన ‘ఉప్పు’తో నిర్మించారు. ఈ సాల్ట్ ఫ్లాట్స్‌కి అబ్బురపడిన పర్యాటకులు - ‘రుచి’ చూట్టానికి ఇక్కడికి తండోప తండాలుగా వచ్చేస్తున్నార్ట. ఉప్పు కుర్చీ.. ఉప్పు టేబుల్ - ఫర్నిచర్ మొత్తం అన్నీ ‘ఉప్పు’లో వేయించినవే. ఒక్క రాత్రికి 84 డాలర్ల వ్యయంతో ‘డబుల్ రూం’లో సాల్ట్ బెడ్‌పై పవళించవచ్చు. ఉప్పులేని కూరల్ని రుచి చూడవచ్చు. ఉప్పు కాస్త తగ్గితే - గోడ గీకితే సరిపోతుందేమో?! హిల్డాగో టూర్‌కి చెందిన టూర్ గైడ్ పెడ్రో పబ్లో మిఖాయెల్ రోచా ఈ హోటల్‌ని ‘్భలోక స్వర్గం’ అంటూ అభివర్ణిస్తాడు. ఆ మాటని అతిశయోక్తిగా కొట్టేయలేం కూడా. మొట్టమొదటిసారి వచ్చిన వారు కొన్ని క్షణాలు ఆశ్చర్యంలో మునిగితేలి - ఆనక మీల్స్‌కి ఆర్డర్ చేస్తారు.
 

ఒకప్పుడు ఈ ప్రాంతమంతా ‘ఉప్పు నీటి’ సెలయేళ్లు ఉండటం మూలంగా ఇక్కడ పర్యాటకుల సందడి అంతగా కనిపించేది కాదు. అడపాదడపా వచ్చి వెళ్లినా సరైన వసతి లేకపోవటంతో చూసి వెళ్లిపోతూండేవారు. ఇక్కడి ఉప్పులో ‘లిథియం’ లభ్యమవుతుందన్న సంగతి తెలిసింత్తర్వాత - వ్యాపార పరంగానూ ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతూ వచ్చింది. లిథియంని బ్యాటరీలలోనూ.. మొబైల్ ఫోన్లలోనూ.. కంప్యూటర్లలోనూ.. ఎలక్ట్రిక్ కార్లలోనూ వాడతారు. ప్రపంచంలో ఉత్పత్తయ్యే ఉప్పులో సగం ఇక్కడ్నుంచీ సరఫరా అయినదే కావటం గమనార్హం. ఇక్కడ హోటల్‌ని నిర్మించాలంటే ‘ఉప్పు’కి మించిన సాధనం మరొకటి లేదని తలచి ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకార చుట్టడమే కాదు - పర్యాటకుల మనసెరిగి మరీ దేశం నలుమూలల వంటకాల ‘రుచుల’ను ఇక్కడ వండి వడ్డిస్తున్నారు కూడా.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top