ఆవలిస్తే ఆరోగ్యం.......అసలు ఆవలిస్తే ఆరోగ్యం ఏమిటని ఆనుకుంటున్నారా? అయితే ఇది చదవండి.

ఆవలిస్తే పేగులు లెక్కపెడతా అని డైలాగులు కొట్టే వారికి ఇది హెచ్చరిక లాంటిదే. అవతలి వాడు ఆవలిస్తే వాడు ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క కాబట్టి పేగులు లెక్కపెట్టే పని మానేసి మీరూ ఆవలించి ఆరోగ్యం కాపాడుకోవడానికి ప్రయత్నించండి. అసలు ఆవలిస్తే ఆరోగ్యం ఏమిటని ఆనుకుంటున్నారా? అయితే ఇది చదవండి. ఆవలింతలొస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారని బిడియపడుతూ దాన్ని ఆపుకోవడానికి చాలా మంది తంటాలు పడుతుంటారు. అయితే ఆవలింతలొస్తే ఆపుకోవడం మాని శుభ్రంగా ఆవలించేసి అవసరమైతే పక్క వాళ్లకు కూడా అంటగట్టేయండని డాక్టర్లు చెబుతున్నారు.

ఎంత ఆవలిస్తే మెదడుకు అంత మంచిదని వారు చెబుతున్నారు. చల్లటి వాతావరణంలోనే కంప్యూటర్ పనిచేస్తుంది. కంప్యూటర్ వేడెక్కిన కొద్దీ దాని పనితనం కూడా తగ్గుతుంది. అలాగే మనిషి మెదడు కూడా వేడెక్కితే జ్ఞాపకశక్తి తగ్గుముఖం పడుతుంది. అప్పుడు మెదడు చల్ల దనాన్ని కోరుకుంటుంది. ఆ సమయంలో సహజసిద్ధంగా వచ్చే ఆవలింతల వల్ల చల్లనిగాలి లోపలకు పీల్చుకుని మెదడు చల్లబడుతుందని శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో బయటపడిందట. అందుకే బద్ధకానికి ప్రతిరూపంగా ఆవలింతలన్న ఆలోచనకు స్వస్తిచెప్పి మనస్ఫూర్తిగా ఆవలించెయ్యండి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top