ప్రపంచ పర్యాటక రంగంలో అగ్రభాగాన నిలిచిన సింగపూర్‌. మరి ఆ ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు అలా వెళ్లొద్దామా..?!


యూరప్‌ దేశాల్లోని వాతావరణ పరిస్థితులను తనలో మమేకం చేసుకున్న సింగపూర్‌లో ప్రజలు ఎక్కువగా, ఇష్టంగా మాట్లాడేది రెండే రెండు బాష లు. అవి ఒకటి మకాన్‌, రెండు సింగ్లీష్‌. ఇంగ్లీష్‌ అనే బాషను విన్నామేగానీ, సింగ్లీష్‌ ఏంటబ్బా.. అని ఆలోచిస్తున్నారా..? మరేం లేదండి.. మలై, ఇండోనేషియా, తమిళం, చైనీస్‌ లాంటి ఇతర భాషలను ఇంగ్లీషుకు మేళవించి సింగపూర్‌ వాసులు మాట్లాడే భాషనే సింగ్లీష్‌ అంటారు. ఇంకా విడమరచి చెప్పుకోవాలంటే సింగపూర్‌ ఇంగ్లీష్‌ అనవచ్చు.ప్రపంచంలోనే అత్యున్నత పర్యాటక కేంద్రంగా విలసిల్లుతున్న సింగపూర్‌లో చూడా ల్సిన ప్రదేశాలు బోలెడు. వాటిల్లో నైట్‌ సఫారీ, సింగపూర్‌ బొటానికల్‌ గార్డెన్స్‌, జూరాంగ్‌ బర్డ్‌ పార్కు, మెర్‌లయెన్‌ పార్క్‌, సెంతోసా ద్వీపం, అండర్‌ సీ వరల్డ్‌... తదితరాలు చాలా ముఖ్యమైనవి.

నిశిరాత్రిలో విహారం... నైట్‌ సఫారీ...

సాధారణంగా జంతుప్రదర్శన శాల లను చూడాలంటే ప్రపంచంలో ఎక్క డైనా పగటివేళల్లోనే అనుమతిస్తుంటా రు. కానీ సింగపూర్‌లో మాత్రం రాత్రి వేళల్లో కూడా వాటిని సందర్శించవ చ్చు. దీనినే నైట్‌ సఫారీ అని పిలుస్తుం టారు. రాత్రివేళల్లో తిరిగే జంతువుల ను, పక్షులను చూడాలంటే ప్రత్యేకమై న చీకటి గుహల్లోనే చూడాలి. ఈ అవ కాశాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా కల్పించింది సింగపూరే. రాత ల్లో జంతువులను వాటి సహజ పరిస్థి తుల్లో చూసే అవకాశం కలగటంతో పర్యాటకులు ఓ వింత అనుభూతికి లోనవుతారు.
 

ఈ నైట్‌ సఫారీలో ప్రత్యేక ఆకర్షణ అక్కడి ఆదివాసుల స్వాగత నృత్యం. బలంగా ఉండే యువకుల విలువిద్యా కౌశల ప్రదర్శన, వెదురుబొంగులు వేగంగా కదులుతుంటే వాటి మధ్య అడుగులు వేస్తూ చేసే నృత్యం చూడ ముచ్చటగా ఉంటాయి. ఇందులో మరో ఆకర్షణ మంటలతో ఆదివాసీలు చేసే నృత్యం. నైట్‌ సఫారీను చూసేందుకు పర్యాటకులు ట్రాములో వెళ్లాల్సి ఉంటుంది. నెమ్మదిగా ట్రాము కదులుతుంటే, జంతువులు వాటి సహజ పరిసరాల లో మనకు చాలా దగ్గరనుంచీ కనిపిస్తాయి.

విహంగాలకు ఆలవాలం... జురాంగ్‌ పక్షి కేంద్రం...
ఆగ్నేయాసియాలోనే అతిపెద్ద పార్క్‌గా ప్రఖ్యాతి చెందిన జురాంగ్‌ పక్షుల కేంద్రం సింగపూర్‌లో చూడాల్సిన మరో అద్భుతమైన ప్రదేశం. 600 జాతులకు చెందిన 8 వేల పక్షులు నెలవైన ఈ పార్క్‌ను ఓ పద్ధతి ప్రకారం చూసేందుకు వీలుగా ఏసీ, పానో రైలు సదుపాయం ఉంది. మెయిన్‌ స్టేషన్‌లో ఎక్కి లోరీ స్టేషన్‌లో దిగి మళ్లీ రైలెక్కి వాటర్‌ఫాల్‌ స్టేషన్‌లో దిగి మళ్లీ అక్కడనుంచి మెయిన్‌స్టేషన్‌ చేరుకోవచ్చు. లోరికీట్‌ పక్షులు (ఎరుపు రంగు చిలుకల్లా ఉండేవి) లోరీ స్టేషన్‌లో దిగినపుడు చూడవచ్చు. ఇక పక్షులకి ఆహారం పెడుతున్నపుడు వాటి హడావుడి చూసితీరాల్సిందే. పక్షులకి మనం కూడా ఆహారం వేస్తూ ఫోటోలు తీయించుకోవచ్చు.

వాటర్‌ఫాల్‌ స్టేషను లో దిగితే 60 జాతులకి చెందిన 1500 పక్షులని వాటి సహజసిద్ధమైన నివాస ప్రాంతా ల్లో చూడగలిగే అరుదైన అవకాశం కలుగుతుంది. ఇక్కడ ప్రత్యేకమైన ఆకర్షణగా మానవనిర్మితమైన అతి ఎతె్తైన జలపాతం సందర్శకులను విశేషంగా ఆకట్టు కుంటుంది. ఈ పార్క్‌లో 200 పెంగ్విన్లని, నిశాచర పక్షుల్ని, పెవికాన్లని, రకరకాల కొంగల్ని కూడా చూడవచ్చు. ఫుజీహాక్‌వాక్‌ స్టేడియంలో గద్దలు, హాక్‌లు, ఫాల్కన్‌ పక్షుల విన్యాసాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. పక్షులు వేటాడే విధానాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం కలు గుతుంది. ఆంఫీథియేటర్‌లో అనేక పక్షుల చేత.. చిన్న రాళ్లతో గుట్టని పగులగొట్టడం, బాస్కెట్‌ బాల్‌ ఆడటం, సందర్శకుడి చేతినుంచి డాలర్‌ నోటు ఎగరేసుకుపోవడం లాంటి ఫీట్లు చేయించడాన్ని చూడవచ్చు.

ఆద్యంతం ఆహ్లాదం... డక్‌టూర్‌...

ఆసియాలోనే మొట్టమొదటిసారి ప్రవేశపెట్టిన సింగపూర్‌ డక్‌టూర్‌ ఒక ప్రత్యేక ఆకర్ష ణ. నీటిమీదా, నేలమీదా ప్రయాణించే ఉభయచర వాహనంలో పన్‌ టెక్‌సిటీ, విక్టోరియా థియేటర్‌ సుప్రీంకోర్ట్‌, వార్‌ మెమోరియల్‌ పార్క్‌, నీటిలో ప్రయాణించి నపుడు ఎప్సలనేడ్‌ మెర్‌లయన్‌ విగ్రహం, తదితర విశేషాలు నేల ప్రయాణంలో చూడవచ్చు. సింగపూర్‌లోని పురాతన చైనా గుడి చూడదగ్గది. ద్వారపాలకులుగా సింహాల విగ్రహాలు ఆకట్టుకుంటాయి. ఇంకా... బుద్ధుడి దంతం ఉన్నదని చెప్పబడే గుడి, సింగపూర్‌ జూ, పాసిక్‌ రిస్‌ పార్క్‌, ఎమ్‌ఎన్‌ టి బొమ్మల మ్యూజియం, నేషనల్‌ మ్యూజియం, వార్‌ మెమోరియ ల్స్‌లాంటివి ఇతర సందర్శనీయ స్థలాలు. ఇక చివరిగా... టూరిస్టు వీసాలు సులభంగా లభించే సింగపూర్‌ చెక్కేయాలంటే.. అక్కడి విమానాశ్రయంలోనే తాత్కాలిక వీసాలను మంజూరుచేసే వ్యవస్థ మనకు తోడ్పడుతుంది.

పచ్చని అందాలకు నెలవు... బొటానికల్‌ గార్డెన్స్‌...
140 సంవత్సరాల చరిత్ర కలిగిన బొటానికల్‌ గార్డెన్స్‌ సింగపూర్‌లో చూడదగ్గ మరో ప్రదేశం. పదివేల రకాల వృక్షాలు ఒకే ప్రాంగణంలో ఉండటం చూస్తే, ఆశ్చర్యచకితులవుతారు. ఇక్కడి పువ్వులు రంగుల ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంటే, ఇందులోని ఆర్కిడ్‌ ఉద్యానవనం మరో అదనపు ఆకర్షణగా చెప్పవచ్చు. ఆసక్తికలవారు వాటి వివరాలు తెలుసుకునేందుకు అక్కడ కంప్యూటర్‌ తెరలను సైతం ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ పిల్లలకోసం ఓ ప్రత్యేకమైన గార్డెన్‌ కూడా ఉంది. ఇక్కడ ఉష్ణప్రదేశాల్లో ఉండే మాంసాహార చెట్లు సైతం మనకు దర్శనమిస్తుంటాయి.

అరుదైన ఆకర్షణ... మెర్‌లయెన్‌ పార్క్‌...

సింగపూర్‌ ఇతర ఆకర్షణల విషయానికి వస్తే... నగరంలోని మెర్‌ లయెన్‌ పార్క్‌ తప్పక చూడాల్సినదే. ‘సింహపురి’... ‘సంగపూర్‌’గా రూపాంతరం చెందడం వల్ల కాబోలు సింహం, చేప కలగలసిన శిల్పానికి అత్యంత ప్రజాదరణ అభించింది. లండన్‌ కన్నా పెద్దదైన సింగపూర్‌ ఫ్లైయర్‌ ఎక్కిన వారు 165 మీటర్ల ఎత్తు నుంచి సింగపూర్‌నే కాకుండా, మెరినాబేని కూడా చూడవచ్చు.

బ్యూటిఫుల్‌ ఎక్స్‌పీరియన్స్‌... సెంతోసా ద్వీపం...
సింగపూర్‌ పర్యటనలో సెంతోసా ద్వీపాన్ని సందర్శించకపోతే ఆ పర్యటనే అసంపూర్ణమని చెప్పాలి. ఈ ద్వీపంలోకి కేబుల్‌ కార్‌లో వెళ్లటమే చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. భూమి నుంచి అనేక అడుగుల ఎత్తు నుంచి విహంగవీక్షణం చేయగలగడం ఒక మరపురాని అనుభూతి. సింగపూర్‌ సాంస్కృతిక చిహ్నమైన మెర్‌లయన్‌ 37 మీటర్ల ఎత్తున్న విగ్రహాన్ని రెప్పవేయకుండా చూడాలనిపిస్తుంది. తొమ్మిదవ అంచె నుంచి సింగపూర్‌ దక్షిణభాగం, సెంతోసా, స్కెలైన్‌ కనిపిస్తాయి. సీతాకోకచిలుకల పార్క్‌ నయనానందకరంగా దర్శనమిస్తుంది.ఇక్కడ పదిహేనువందల సీతాకోక చిలుకలనే కాకుండా మూడు వేల రకాల అరుదైన అందమైన కీటకాల్ని చూసే అవకాశం కలుగుతుంది. అలాగే ఇక్కడి అండర్‌ వాటర్‌ వరల్డ్‌లో 2500 జాతులకి చెందిన 2,500 జలాచరాల్ని చూసే అదృష్టం కలుగుతుంది. 83మీటర్ల సొరంగం నుంచి ట్రావ్‌లేటర్‌ ద్వారా అనేక రంగుల, ఆకారాల జలచరాల్ని చూడడం ఒక వింత అనుభవం. ఇమేజెస్‌ ఆఫ్‌ సింగపూర్‌ మ్యూజియం సింగపూర్‌ చరిత్ర, జాతులు, జీవనవిధానాలు సమగ్రంగా తెలియజేస్తుంది.  
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top