నడిస్తే ఏమొస్తుంది? అలసట తప్ప అనుకునేవారికి.......

నడిస్తే ఏమొస్తుంది? అలసట తప్ప అనుకునేవారికి అమెరికన్ మెడికల్ కాలేజ్ చెబుతున్న వాస్తవాలు ఆశ్చర్యపరుస్తాయి. ప్రతి రోజూ వేగంగా నడక సాగించే వారికి పదేళ్ల ఆయుష్షు బోనస్ అంటున్నారీ విశ్లేషకులు. ఈ విషయాన్ని నిరూపించేందుకు సంవత్సరకాలం పాటు మెడికల్ కాలేజ్ సిబ్బంది చాలా ప్రయోగాలే చేశారు.

వివిధ దశల్లో వందలాదిమందిపై పరిశోధన చేసి కొన్ని సూచనలు ఇచ్చారు. వారానికి ఆరుమైళ్ల దూరం నడిచేలా ప్రణాళికలు వేసుకుంటే మంచిదని అంటున్నారు. వేగంగా నడవడం ద్వారా పురుషుల కంటే స్త్రీలకే మరింత మేలని కూడా వీరు చెబుతున్నారు. మహిళలు వేగవంతమైన నడక ద్వారా గుండెపోటు వ్యాధిని అధిగమించవచ్చట. ఇప్పటికే నడక అలవాటు ఉన్న వాళ్లు కాళ్లకు మరింత పని చెప్పండి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top