కావలసిన పదార్థాలు:
పొట్లకాయ - 6 అంగుళాల పొడవు ముక్క, బియ్యప్పిండి - పావు కప్పు,
(ఇష్టమైతే) బొంబాయి రవ్వ - 1 టేబుల్ స్పూను, జీలకర్ర - పావు టీ స్పూను,
పచ్చిమిర్చి- 2, కొత్తిమీర తరుగు- పావు కప్పు, ఉప్పు - రుచికి తగినంత, నూనె
- కాల్చడానికి సరిపడా. తయారుచేసే విధానం:
పొట్లకాయల్ని పెద్దముక్కలుగా తరిగి, పచ్చిమిర్చితో కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఒక పాత్రలో రవ్వ, బియ్యప్పిండి, ఉప్పు, జీలకర్రతో పాటు రుబ్బిన పొట్లకాయ మిశ్రమం వేసి అవసరమైతే నీరు పోసి జారుగా కలుపుకోవాలి. పెనంపై గరిటతో వేసి (దోశలా పరవకుండా) రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి. ఈ దోశల్ని వేడివేడిగా మీకిష్టమైన చట్నీతో తినవచ్చు.