
అత్యంత ఖరీదైన కాఫీని లండన్ రెస్టారెంట్ వాళ్లు తయారు చేయనున్నారు. దానిని
పామ్ సివెట్ అనే పిల్లిరకం జాతికి చెందిన జంతువు
విసర్జించిన వ్యర్థ చెర్రీస్ గింజల నుంచి తయారు చేస్తున్నట్టు రెస్టారెంట్
నిర్వాహకులు ప్రకటించారు. ఇండోనేషియాలోని సుమత్ర దీవిలో ఉండే ఈ సివెట్‌లు
అక్కడ పండే చెర్రీస్‌ను తింటాయి. ఆ చెర్రీస్‌లో ఉండే గింజలను సివెట్‌లు
జీర్ణం చేసుకోలేవు.అవి మలం ద్వారా బయటకు వస్తాయి. అలా దొరికే గింజలకు
విపరీతమైన డిమాండ్ ఉంది. సివెట్‌ల జీర్ణాశయంలో ఉండే గ్యాస్ ఆ గింజల్లో ఒక
రకమైన టేస్ట్ రావడానికి కారణమవుతుంది. అందుకే ఆ గింజలకు డిమాండ్ ఎక్కువట.
అలా సేకరించిన గింజల ద్వారా ఈ కాఫీ తయారు చేస్తున్నారు. ఇంతకీ ఈ కాఫీ ధర
చెప్పనేలేదు కదూ.. ఒక కప్పు తాగాలంటే 5, 700 రూపాయలు చెల్లించాలి.