ఇవి కావాలి...
క్యారట్లు 4
బంగాళాదుంపలు 4
టమాటోలు 2
పచ్చిమిర్చి 2
అల్లం చిన్న ముక్క
జీల కర్ర 1 స్ఫూను
నూనె 3 స్ఫూన్లు
మసాలాలకు...
గరం మసాలా అర స్ఫూన్లు
ధనియాల పొడి 3 స్ఫూన్లు
కారం 1 స్ఫూను
పసుపు అర స్ఫూను
ఉప్పు తగినంత
ఇలా చేయాలి...
క్యారట్ తొక్కతీసి పొడుగ్గా ముక్కలు తరుక్కోవాలి. బంగాళాదుంపలు తొక్కుతీసి
ముక్కులు చేయాలి. అల్లం, టమాటోలు, పచ్చిమిర్చి కూడా కట్ చేయాలి. బాణాలిలో
నూనెవేసి కాగాక జీలకర్రవేసి, కొంత సమయం తరువాత అందులో క్యారట్, ఆలూ
(బంగాళదుంప),పసుపు వేసి మూతపెట్టి సన్న సెగమీద మాగనివ్వాలి.గరం
మసాలా,ధనియాల పొడి, కారం వేసి రెండు నిమిషాలు ఉంచి దించండి. హాట్ హాట్
క్యారట్ ఆలూ కూర్మా రోటీతో తినడానికి రెడి. అన్నంతో కూడా బావుంటుంది.