లావు, సన్నం, మధ్యస్థం బట్టి డ్రెస్ ఎంపిక , ఏ డ్రెస్‌కి ఎలాంటి ఫ్యాబ్రిక్ బాగుంటుంది .

లావుగా ఉన్నవారు...
 చీరలు కట్టుకునేవారు మరీ ట్రాన్స్ పరెంట్‌గా కాకుండా మరీ మందంగా లేని ఫ్యాబ్రిక్‌ను ఎంచుకోవాలి. ఇక డ్రెస్ సెలక్ట్ చేసుకున్నప్పుడు శాటిన్ కాకుండా అన్ని రకాల ఫాలింగ్ ప్యాబ్రిక్‌ను ఎంపిక చేసుకోవచ్చు. డ్రెస్సులు కుట్టించుకునేటప్పుడు కాటన్ లైనింగ్ వాడకూడదు. కాటన్ మిక్స్ ఉన్న లిజిబిజి క్లాత్, క్రేప్, శాటిన్ మాత్రమే లైనింగ్‌గా వాడాలి. చుడీ కుట్టించుకుంటే నెట్టెడ్ ఫ్యాబ్రిక్‌తో కాకుండా కొద్దిగా మందం బట్ట్ ఉపయోగించాలి. సల్వార్ అయితే జార్జెట్, క్రేప్ మెటీరియల్‌కి సన్నని లైనింగ్ మాత్రమే వాడాలి. అనార్కలీలు కుట్టించుకోవాలంటే ఎంపైర్‌లైన్ నుంచి ఫ్లేర్ లైన్ ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది. ఛాతి భాగంలో మాత్రం మరీ పలచని, మందం కాని బట్టను ఎంచుకోవాలి. బెనారస్, బ్రొకేడ్ క్లాత్‌లను అనార్కలీకి వాడకూడదు. ట్రౌజర్లు వేసుకోవాలనుకుంటే జ్యూట్ మిక్సింగ్ లెనిన్ ఫ్యాబ్రిక్స్ వాడాలి. వెల్వెట్స్, సింథటిక్ మెటీరియల్ వాడకూడదు. పల్చగా ఉన్న టీ షర్ట్స్‌ని వేసుకోకూడదు. సరైన ఫ్యాబ్రిక్, ప్యాట్రన్, కట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే లావుగా ఉన్న వారు కూడా అన్ని రకాల డ్రెస్సులు వేసుకోవచ్చు.

సన్నగా ఉన్నవారు...
నెట్, పల్చటి షిపాన్స్ వేసుకున్నప్పుడు బ్రొకేడ్, సిల్క్ లైనింగ్స్ వాడొచ్చు. డ్రెస్సులకు వాడే బట్ట మందంగా ఉండాలి. మరీ పల్చగా, మరీ మందంగా కాకుండా ఉన్న పటియాల, టాప్ వేసుకుంటే బాగుంటుంది. స్లిమ్‌గా ఉన్నవారు రా సిల్క్స్, బెనారస్, బ్రొకేడ్, ఖాదీ సిల్క్స్ వేసుకుంటే బాగుంటుంది. ఖాదీ కాటన్, శాటిన్, లెనిన్ టాప్స్ వేసుకోవచ్చు. హై నెక్ ఉన్న టాప్స్ అయితే లుక్ బాగుంటుంది. మధ్యస్థంగా ఉన్నవారు... మరీ లావుగా, మరీ సన్నగా కాకుండా ఉన్నవారు ఏ ఫ్యాబ్రిక్ అయినా ఎంచుకోవచ్చు. వీరు డ్రెస్ కట్స్, స్లీవ్స్, ఫ్లేర్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మెత్తని కాటన్, కంచి, బెనారస్‌లలో కొంచెం మందంగా ఉన్న ఫ్యాబ్రిక్ బాగుంటుంది. స్వచ్ఛమైన పట్టుచీరల్లో మాత్రమే పర్‌ఫెక్ట్ ఫాలింగ్ ఉంటుంది. మీడియమ్ సైజులో ఉన్నవారు శరీరానికి హత్తుకునేలా ఉండే ఫ్యాబ్రిక్ వేసుకంటే స్లిమ్‌గా కనిపిస్తారు.

 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top