మధుమేహనికి అధునిక వైద్యం - అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త మందులు

మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు జీవనశైలి, తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవటంతో పాటు మందులు వాడటం తప్పనిసరి. గతంలో కంటే ప్రస్తుతం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త మందులు అందుబాటులోకి వచ్చాయి.కొత్త ఔషధాల సహాయంతో డయాబెటిస్‌ను పూర్తిస్థాయిలో అదుపులో వుంచుకోవచ్చు. 

గ్లిప్టిన్స్ డీపీపీ-4 ఇన్‌హెబిటర్ :
డయాబెటిస్‌ను అదుపులో ఉంచేందుకు తాజాగా ఈ మందు అందుబాటులోకి వచ్చింది. మ«ధుమేహాన్ని అదుపు చేసేందుకు గతంలో సల్ఫోనిల్ యూరియా, బై గొనెట్స్ మెట్‌ఫార్మింగ్ మందులు వాడేవారు. ఈ సరికొత్త మందులతో డయాబెటిస్‌ను మరింత సమర ్థంగా అదుపులో వుంచుకోవచ్చు. దీంతోపాటు థియో బోనెడ్ వ్రేడయాన్స్ మందు కూడా అందుబాటులోకి వచ్చింది.

హ్యుమన్ ఇన్సులిన్ :

డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకునేందుకు వైద్యుని సలహాపై ఇన్సులిన్‌ను ఉపయోగించాలి. గతంలో గుర్రాలు, పందుల నుంచి సేకరించిన బ్లడ్ సీరంను స్టెరిలైజ్ చేసి ఇన్సులిన్‌ను తయారుచేసేవారు. ఇప్పుడు లాబోరేటరీలో బాక్టీరియా నుంచి హ్యుమన్ ఇన్సులిన్‌ను తయారు చేస్తున్నారు. దీని వల్ల ఇన్సులిన్ లభ్యత, నాణ్యత పెరగటంతోపాటు ధర కూడా తగ్గి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇన్సులిన్ వాడకంపై రోగులు అపోహలు తొలగించుకోవాలి. వైద్యుల సలహామేరకు ఇన్సులిన్ ఉపయోగించాలి. అలా మేహాన్ని సమర్ధంగా అదుపులో వుంచుకొనేందుకు ప్రయత్నించాలి. మందులతో మధుమేహం అదుపులోకి రాకపోతే ఇన్సులిన్‌ను తీసుకోవటం ద్వారా కి డ్నీ, గుండె జబ్బులను దూరంగా వుంచుకోవచ్చు.


ఇన్సులిన్ పంపు:
ఇటీవల ఇన్సులిన్ పంపు అందుబాటులోకి వచ్చింది. రోగికి కావాల్సిన ఇన్సులిన్‌ను డోస్ ప్రకారం 24 గంటలూ శరీరంలోకి వెళ్లేలా చేసేలా ఇన్సులిన్ పంపును వినియోగిస్తున్నారు. ఈ పంపు మనం నిర్దేశించిన ప్రకారం ఇన్సులిన్‌ను శరీరానికి అందిస్తూ డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది. దీనివల్ల రోగికి ఎలాంటి నొప్పి కలగదు. శరీరంలో చక్కెర శాతం తక్కువ, ఎక్కువ కావటం ఉండదు. ఒకసారి ఈ పైపును శరీరానికి పెట్టి ఉంచితే చాలు.

ఇన్సులిన్ పెన్:

డయాబెటీస్ రోగులకు వ్యాధిని అదుపులో ఉంచేందుకు వీలుగా 15 రకాల ఇన్సులిన్ పెన్‌లు నేడు మార్కెట్‌లోకి వచ్చాయి. చిన్న నీడిల్‌తో నొప్పి లేకుండా దీన్ని వాడుకోవచ్చు. ఫ్రిజ్‌లో పెట్టే అవసరం కూడా లేకుండా జేబులో పెట్టుకొని, షుగర్ పెరిగినపుడు దీన్ని వినియోగించుకోవచ్చు.

ఐ లెట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ :

మధుమేహ రోగులకు శరీరంలోనే ఇన్సులిన్ తయారు చేసుకునేలా ఐ లెట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసే ప్రక్రియ కూడా త్వరలో అందుబాటులోకి రానుంది. విదేశాల్లో క్లినికల్ పరీక్షల దశలో ఉన్న ఈ విధానం వల్ల డయాబెటిస్‌ను అదుపు చేయవచ్చు. పాక్రియాటిక్స్‌లో ఐ లెట్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో శరీరంలోనే ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయవచ్చని విదేశీ వైద్యులు నిరూపించారు.

వారానికో ఇన్సులిన్ డోస్ :

ప్రతిరోజు మూడు పూటలా ఇన్సులిన్ తీసుకోవటం కంటే వారానికో రోజు ఇంజక్షన్ తీసుకుంటే చాలు మధుమేహం అదుపులో ఉండేలా గ్లిప్టిన్స్ ఇంజక్షన్‌లు అందుబాటులోకి వచ్చాయి. రోజుకు మూడు సార్లు కాకుండా ఒక సారి తీసుకునే ఇన్సులిన్‌లు సైతం అందుబాటులోకి వచ్చాయి. దీంతోపాటు మధుమేహ రోగులకు ఇన్సులిన్ నాజిల్ స్ప్రేలు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top