ఉల్లి పొంగనాలు


కావాల్సిన పదార్థాలు:
మినప్పప్పు - ఒక కప్పు, బియ్యం - రెండు కప్పులు, అటుకులు - పావు కప్పు, మెంతులు - ఒక టీ స్పూను, ఉల్లిపాయలు రెండు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: 

మినప్పప్పుని, బియ్యాన్ని, మెంతుల్ని శుభ్రంగా కడిగి ముందురోజు నానపెట్టుకోవాలి. అందులో అటుకులు కూడా వేయాలి . తెల్లారాక వీటిని మెత్తగా రుబ్బుకోవాలి. దోసప్ప పిండిలా మెత్తగా ఉండాలి. సరిపడ ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయల్ని పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి ఒక టేబుల్ స్పూను నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి. బాగా ఎర్రగా కాకుండా దోరరంగు రాగానే తీసేయాలి. వాటిపై కొద్దిగా ధనియాల పొడి చల్లాలి. ఇప్పుడు గుంట పొంగనాల పెనంలో పిండిని వేసుకోవాలి. గుంట నిండా కాకుండా సగం వరకూ పిండి వేసి మధ్యలో వేగించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని పొయ్యిమీద పెట్టాలి. పది నిమిషాల తర్వాత రుచికరమైన ఉల్లి పొంగనాలు తయారయినట్టే.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top