కావలసిన పదార్థాలు:
గుడ్లు - 3,
మిరియాలపొడి - అర టీ స్పూను, కొత్తిమీర తరుగు - పావు కప్పు, ఉల్లితరుగు -
పావు కప్పు, పచ్చిమిర్చి తరుగు - అర టీ స్పూను, క్యాప్సికం, టమోటా చిన్న
ముక్కలు - అరకప్పు, నూనె - అర టేబుల్ స్పూను, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం:ఒక గిన్నెలో పచ్చసొన, ఉప్పు, మిరియాలపొడి వేసి గిలకొట్టి పక్కనుంచాలి. మరో పాత్రలో తెల్లసొన, ఉల్లి తరుగు, కొత్తిమీర గిలకొట్టాలి. పెనంపై ముందుగా తెల్లసొన మిశ్రమం ఆమ్లెట్గా వేసి, అర నిమిషం తర్వాత దాని పైన పచ్చసొన మిశ్రమాన్ని పరవాలి. పైన క్యాప్సికం, టమోటా, మిర్చి తరుగును చల్లి సన్నని సెగమీద వేగించి అర్ధచంద్రాకారంలో మడిచి తీసేయాలి.