బాఠాణీ కొబ్బరిపాలతో కూర

కావలసిన పదార్థాలు: 
ఎండు బటాణీలు - 1 కప్పు, ఉల్లిపాయ -1, టమోటా -1, అల్లంవెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, పచ్చిమిర్చి - 2, పసుపు, కారం, మసాలపొడి, ఆవాలు - అర టీ స్పూను చొప్పున, (చిక్కని) కొబ్బరిపాలు - అర కప్పు, (పలచని) కొబ్బరిపాలు - ముప్పావు కప్పు, కరివేపాకు - 4 రెబ్బలు, నూనె - అర టేబుల్ స్పూను, ఉప్పు - రుచికి తగినంత.
 

తయారుచేసే విధానం: 
బటాణీలు ఒక రాత్రంతా నానబెట్టి, కుక్కర్లో కొద్ది నీటిలో చిటికెడు ఉప్పు వేసి ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించాలి. కూరగాయల్ని సన్నగా తరిగి ఉంచుకోవాలి. కడాయిలో ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, టమోటా ఒకటొకటి వేసి వేగించాలి. పసుపు, కారం, గరం మసాలాలు వేసి ఒక నిమిషం తర్వాత 2 టేబుల్ స్పూన్ల నీరు, పలచని కొబ్బరిపాలు పోసి ఉడికిన బటాణీలు కలపాలి. కూర చిక్కబడ్డ తర్వాత స్టౌవ్ ఆపేసి, చిక్కని కొబ్బరిపాలు పోసి రెండు నిమిషాలు ఉంచి దించేయాలి. ఈ కూర పరాటాల్లోకి బాగుంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top