సూలకాయం ఇక సమస్యేకాదు! హోమియోపతిలో బరువు తగ్గడానికి చాలా మంది మందులు ఉన్నాయి.

హోమియోపతిలో బరువు తగ్గడానికి చాలా మంది మందులు ఉన్నాయి. నిపుణులైన వైద్యుడు దీనికి నమ్మకమైన పరిష్కారాన్ని చూపించగలుగుతారు. శరీరంలోని కొవ్వును కరిగించడంలో హోమియో మందులు ప్రత్యేక పాత్ర పోషించగలవు. మూల కారణాన్ని గుర్తించి చికిత్స చేస్తే ఒబేసిటీని, దాని వల్ల దుష్ఫలితాలను హోమియో చికిత్స నివారించగలుగుతుంది.

ఫైటోలక్కా: 

శరీరంలోని కొవ్వుని కరిగిస్తుంది. ఇది లోతుగా పనిచేసే మందు. వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే వాడాలి.

కాలికార్బ్: 

మధ్య వయసు దాటిన వారిలో వచ్చే అధిక బరువుకు ఈ మందు వాడితే ఫలితం ఉంటుంది. మానసిక ఒత్తిళ్లతో సతమతమయ్యేవారు, శరీరం పాలిపోయి ఉన్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

గ్రాఫిటిస్:

అధిక బరువుగల పిల్లలకు ఇది మంచి మందు. బొద్దుగా ఉండి త్వరగా అలసిపోయే పిల్లలు, ఓపిక తక్కువగా ఉండి ఎప్పుడూ ఏదో ఒకటి తినే పిల్లలకు ఈ మందు మంచి ఫలితాలు ఇస్తుంది.

ఏది ఏమైనా సొంత నిర్ణయాలు తీసుకోకుండా సరైన వ్యాయామంతో, ఆహార నియమాలతో, మంచి వైద్యుని పర్యవేక్షణలో మందులు వాడితే స్థూలకాయం పెద్ద సమస్య కాదు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top