స్టఫ్డ్ ఆనియన్

కావాల్సిన పదార్థాలు:
ఉల్లిపాయలు - నాలుగు, క్యారెట్లు - మూడు, కోడి గుడ్డు - ఒకటి, టమాట - రెండు, ధనియాల పొడి - ఒక టీ స్పూను, కారం - అర టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం:

ముందుగా ఉల్లిపాయలపై పొట్టు తీసి మధ్యలో రంధ్రం చేసి రెండు పొరలు ఉంచి మిగతా ఉల్లినంతా తీసేయాలి. తీసిన ఉల్లిని చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. క్యారెట్లని ముక్కలుగా కోసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టి నూనె పోసి బాగా కాగాక ఉల్లిపాయ ముక్కలు, టమాట ముక్కలు వేసి వేగించాలి. ఇవి బాగా వేగాక కోడి గుడ్డు కూడా వేసి వేగించాలి. చివరిలో క్యారెట్ ముక్కలు, కొత్తిమీర తురుము వేయాలి. ఉప్పు, కారం, ధనియాల పొడి, వేసి బాగా కలిపి దించేయాలి. ఈ మిశ్రమాన్ని ఉల్లిపాయల్లో కూరాలి. పొయ్యి మీద మరో గిన్నె పెట్టి కొద్దిగా నూనె పోసి బాగా కాగాక అందులో ఉల్లిపాయలు పెట్టి సన్నని మంటపై ఓ పదినిమిషాలు మగ్గనిచ్చి దించేయాలి. స్టఫ్ట్ ఆనియన్ రెడీ అయినట్టే.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top