పాశ్చాత్య దుస్తులు అనగానే సింథటిక్, జీన్స్, లెనిన్ అని అందరికీ ఒక
ఫీలింగ్. కాని కలంకారి, మంగళగిరి, ఖాదీ కాటన్స్... తోనూ వెస్ట్రన్ వేర్
తయారుచేసుకోవచ్చు. మోకాళ్ల వరకు ఉన్న ఖాదీ టాప్, బాటమ్ వేసుకొని పెద్ద
బెల్ట్ పెట్టుకుంటే మోడ్రన్‌గా ఉంటారు. షర్ట్స్ అయితే కలంకారితో గాని,
మంగళగిరి క్లాత్‌తో గాని కుట్టించుకోవచ్చు. గౌన్లు అయితే ఫ్లెయిర్,
ఫ్రిల్స్ ఉన్న మల్మల్ ఫ్యాబ్రిక్‌వి ఎంపిక చేసుకోవచ్చు. మల్మల్ పల్చగా
ఉంటుంది. ఎక్కువ ఫ్రిల్స్ పెట్టుకున్నా హెవీగా అనిపించదు. ప్రింటెడ్,
ప్లెయిన్ మల్ మల్ లేదా కలంకారీ క్లాత్ కూడా సౌకర్యంగా ఉంటుంది. ఫార్మల్
వేర్ వేసుకోవాలనుకున్నప్పుడు జ్యూట్ లాంగ్ ‘ఎ’ లైన్స్ కట్ దానిపై కాటన్
ఫార్మల్ షర్ట్ వేసుకోవచ్చు.