సన్నబడాలనుకుంటున్నారా? ఇంట్లోనే ఉండి నాజూగ్గా తయారు కావచ్చు. ఎలాగంటారా?

సన్నబడాలనుకుంటున్నారా? జిమ్‌కో, ఫిట్‌నెస్ సెంటర్‌కో వెళ్లి బరువు తగ్గించుకోవాలనుకుంటున్నారా? అక్కడకు వెళ్లడానికి మీకు తీరిక లేకపోతే ఇంట్లోనే ఉండి నాజూగ్గా తయారు కావచ్చు. ఎలాగంటారా? ఈ పనులు చేసి చూడండి.

  • ఇంట్లో టివిని రిమోట్ సాయం లేకుండా చూసేందుకు ప్రయత్నించండి. చానెల్ మార్చాలనుకున్నప్పుడల్లా లేచి టివిపైన ఉన్న బటన్లు ఆపరేట్ చేయండి. కుర్చీలోనో, సోఫాలోనో కూలబడి టివి చూసేకన్నా టివి బటన్లు నొక్కడానికి అప్పుడప్పుడూ కదులుతూ ఉండండి.
  • ఇంట్లో మిక్సీ, గ్రైండర్ పాడైపోతే అవి రిపేరై వచ్చేవరకు వంటపని మానెయ్యకుండా రుబ్బురోలు ఉపయోగించండి. దీని వల్ల శారీరక శ్రమ జరిగి ఒంట్లో కొవ్వు కరుగుతుంది.
  • పనిమనిషి రాకపోతే అంట్ల గిన్నెలను అలాగే వదిలేసే కన్నా చేతులకు కొంచెం పని కల్పించండి, నామోషీ ఫీలవ్వకుండా. ఆ శ్రమకు చెమట రూపంలో ఫలితం దక్కడం ఖాయం.
  • వాషింగ్ మిషన్ పాడైపోతే మాసిన బట్టలను గుట్టలుగా పేర్చేయకుండా మీరే ఉతుక్కోవడానికి ప్రయత్నించండి. బోలెడన్ని క్యాలరీలు ఖర్చయి చలాకీగా ఉంటారు.

  • పిల్లలు ఎక్కడపడితే అక్కడ పుస్తకాలు, బొమ్మలు, విడిచిన బట్టలను వదిలేస్తారు. విసుక్కోకుండా వాటిని సర్దండి. మీకు తెలియకుండానే మీ ఒళ్లు వంగుతుంది.
  • పిల్లలు వేరే గదిలో ఉంటే కూర్చున్న చోటు నుంచి కదలకుండా కేకేసి వాళ్లను పిలవకండి. వాళ్ల గదిలోకి మీరే వెళ్లండి. ఇంట్లో కూడా నడక మంచిదే.
  • ఇరుగుపొరుగు వారితో పనిబడితే ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించవద్చు. చక్కగా నడుచుకుంటూ వాళ్ల ఇళ్లకే వెళ్లండి. వాకింగ్ చేసినట్లు కూడా ఉంటుంది.
  • వంట చేస్తున్నపుడు ఖాళీగా ఉండేకన్నా డాన్సులు గట్రా వస్తే ఆ ప్రావీణ్యాన్ని ప్రదర్శించండి. వంటతోపాటే ఎక్సర్‌సైజ్ చేసినట్లూ ఉంటుంది.
  • పెంపుడు జంతువులకు స్నానం చేయించే పని ఎవరికో అప్పగించకుండా ఆ పనేదో మీరే చేస్తే మంచి వ్యాయామంలా ఉంటుంది.
మన ఇంట్లో పని మనమే చేసుకోవడం వల్ల డబ్బు ఆదాతోపాటు ఆరోగ్యానికీ మంచిది. శారీరక శ్రమ వల్ల ఫిట్‌నెస్ కూడా మెరుగుపడుతుంది. బోలెడు డబ్బు ఖర్చుపెట్టి ఫిట్‌నెస్ సెంటర్లకు వెళ్లే కన్నా చిన్న చిన్న పనులలోనే మనకు మేలు జరుగుతున్నప్పుడు ఇంకెందుకు ఆలస్యం.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top