చలికాలంలో ఉష్ణోగ్రత తగ్గటం వల్ల హృద్రోగులకు వచ్చే సమస్యలకు కొన్ని రకాల ముందుజాగ్రత్తలు

చలికాలంలో ఉష్ణోగ్రత తగ్గటం వల్ల హృద్రోగులకు వివిధ రకాల సమస్యలు తలెత్తుతుంటాయి. రక్తనాళాలు కుచించుకుపోతుంటాయి. దీనివల్ల గుండె నుంచి రక్తనాళాల్లోకి అధిక రక్తం ప్రవహిస్తుంది. ఇలాంటప్పుడు కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్అటాక్‌లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. చలికాలంలో హృద్రోగులకు వచ్చే సమస్యలను కొన్ని రకాల ముందుజాగ్రత్తలు.

సాధారణంగా మనిషి శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీలు ఉంటుంది. చలికాలంలో చలి ప్రభావంతో ఉష్ణోగ్రత తగ్గినపుడు శరీర ఉష్ణోగ్రతను సాధారణంగా ఉంచేందుకు జరిగే ప్రక్రియతో రక్తనాళాలు కుచించుకుపోతుంటాయి. దీన్ని వ్యాసో కన్‌స్ట్రక్షన్స్ అంటారు. దీనివల్ల అధిక రక్తపోటు సమస్య ఏర్పడుతుంది. చలికాలంలో సూర్యరశ్మి ప్రభావం తగ్గటం వల్ల విటమిన్ డి 3 తక్కువవుతుంది. దీంతో కొలెస్ట్రాల్ శాతం పెరిగి హార్ట్అటాక్‌లు వచ్చే అవకాశం పెరుగుతుంది.

మెదడులోని నరాలు చిట్లటం, రక్తం క్లాట్ అవటం వల్ల బ్రెయిన్ హెమరేజ్‌తోపాటు పక్షవాతం లాంటి సమస్యలు వస్తుంటాయి. తెల్లవారుజామున 4 నుంచి 8 గంటల వరకు చలి ప్రభావం వల్ల శరీరంలో హార్మోన్స్ పెరిగి గుండెనొప్పి సమస్య వస్తుంది. హార్మోన్‌లు పెరగటాన్ని ఎడ్రినల్‌విన్ హార్మోన్ అంటారు. వేసవికాలం కంటే చలికాలంలో హృద్రోగులకు 15 శాతం గుండెనొప్పి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని పరిశీలనలో తేలింది. చలి ప్రభావం నేరుగా గుండెపై చూపిస్తుంది. ఉష్ణోగ్రత పది శాతం మారితే బ్లడ్‌ప్రషర్‌లో 5నుంచి 7 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యురీ మేర తేడా వస్తుంది. మంచుకురిసే ప్రాంతాల్లో ప్లేట్‌లెట్లు పెరిగి రక్తం గడ్డ కడుతుంది.

గుండె బలహీనంగా ఉంటే
చలికాలంలో గుండె నొప్పి రావటం, ఆయాసం వచ్చినా, శ్వాస పీల్చటం కష్టం అనిపించినా, చెమట అధికంగా వచ్చినా హృద్రోగులు అశ్రద్ధ చేయకుండా వెంటనే కార్డియాలజిస్ట్‌ను సంప్రదించాలి. హృద్రోగుల్లో ఆక్సిజన్ వినియోగం పెరిగి, ఎక్సైర్‌సైజ్ కెపాసిటీ తగ్గుతుంది. రక్తనాళాల్లోని రక్త సాంద్రత పెరిగి గుండెనొప్పి వస్తుంది. ఈ కాలంలో ఊపిరితిత్తుల సమస్యలు కూడా తలెత్తుతాయి. చలి ప్రభావంతో గుండె బలహీనంగా ఉన్న వారు కొద్దిదూరం నడిచినా దమ్ము వస్తుంది. కాళ్లు వాపులు రావటం, అధిక మూత్రం, గుండెదడ పెరగటం లాంటి లక్షణాలు ఉంటాయి.



నిర్ధారణ
గుండె బలహీనంగా ఉన్నవారు కొన్ని రకాల పరీక్షల ద్వారా నిర్ధారించుకోవాలి. హార్ట్ ఎన్‌లార్జ్‌మెంట్ ఉంటే కార్డియాలజిస్టులు క్లినికల్‌గా నిర్ధారిస్తారు. ఎకో కార్డియాక్‌గ్రామ్, హార్ట్ స్కానింగ్ పరీక్షల ద్వారా గుండె స్థితిని తెలుసుకోవచ్చు. ఈ సమస్య ఉన్న వారు సరిగా నిద్రపోలేరు. పడుకుంటే వచ్చే ఆయాసంతో లేచి కూర్చుంటారు.

ఇన్‌ఫ్లూయెంజా వ్యాక్సిన్
గుండె బలహీనంగా ఉన్న హృద్రోగులు చలికాలంలో ఇన్‌ఫ్లూయెంజా,లేదా నియోకాకల్ వ్యాక్సిన్ తీసకోవటం ద్వారా సమస్యను తగ్గించవచ్చు. హృద్రోగికి గుండె నొప్పి, పక్షవాతం లాంటి సమస్యలు తలెత్తకుండా ఈ వ్యాక్సిన్ కొంతవరకు నిరోధిస్తుంది.

ముందుజాగ్రత్తలు
హృద్రోగులు చలికాలం వచ్చిందంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటం ద్వారా గుండెనొప్పి ముప్పును నివారించవచ్చు.

- వీలైనంత వరకు చలిలో బయట తిరగటం తగ్గించాలి.
- తప్పనిసరిగా తిరగాల్సి వస్తే తల, చేతులతో పాటు మొత్తం శరీరాన్ని కప్పిఉంచేలా ఉన్ని దుస్తులు ధరిస్తే    మంచిది  కాళ్లకు షూ, చేతులకు గ్లౌజ్‌లు వేసుకోవాలి.
- రాత్రివేళ ప్రయాణాలు చేయటం మానివేయాలి.
- వాకింగ్ మానివేసి, వ్యాయామం ఇంట్లోనే చేసుకోవాలి.
- గుండె సమస్యలు తలెత్తినపుడు వెంటనే కార్డియాలజిస్టును సంప్రదించాలి.
స్టెమ్‌సెల్ థెరపీ
హృద్రోగ సమస్యలకు స్టెమ్‌సెల్ థెరపీ వైద్యం త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో క్లినికల్ పరీక్షల దశలో ఉన్న ఈ కొత్త విధానం త్వరలో మన దేశంలోనూ అందుబాటులోకి రానుంది. గుండె నుంచి నాళాలకు రక్తం సరఫరాను మెరుగుపర్చడానికి మయోకార్డియాక్ సెల్స్‌ను రీజనరేట్ చేస్తారు.

క్రయోబ్యాంకులు, లైఫ్‌సెల్‌లలో భద్రపర్చిన మయోకార్డియా లియోసైట్స్ (హార్ట్ మజిల్‌సెల్స్) ను ఇంజక్షన్ ద్వారా దెబ్బతిన్న హృదయ కండరాలకు పంపిస్తారు. లేదా యాంజియోప్లాస్టీ ద్వారా గుండెరక్తనాళాల్లోకి హార్ట్ మజిల్‌సెల్స్‌ను పంపించి హృదయకండరాలను మెరుగ్గా పనిచేసేలా చేస్తారు. దీని వల్ల హృద్రోగ సమస్యలు పరిష్కారమవుతాయి.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top