ఇక మీదట గ్లూకోజ్ స్థాయి సరి చూసుకునేందుకు శరీరాన్ని ఇబ్బంది
పెట్టనక్కర్లేదు. ఒక కన్నీటి చుక్క చాలు మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఎంత
ఉందో తెలిపేందుకు అంటున్నారు మిచిగాన్కు చెందిన శాస్త్రవేత్తలు. ఇందుకోసం
ఎలక్ట్రో కెమికల్ సెన్సార్ పరికరం ఒకదాన్ని కనుగొన్నారు వాళ్లు.
కన్నీటిచుక్కను సూక్ష్మమైన కాపిల్లరీ ట్యూబ్లోకి తీసుకుని అందులో పరీక్షిస్తే రక్తంలో చక్కెర స్థాయి తెలిసిపోతుంది. ఈ పరికరం మార్కెట్లోకి వస్తే డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు నొప్పితో కూడిన రక్త పరీక్షలకి సెలవు పలకొచ్చు. కాకపోతే పరీక్ష చేసుకోవాలనుకున్నప్పుడల్లా కన్నీళ్లు రావాలంటే కష్టమే.