హోమ్ మేడ్ చాక్లెట్ తయారు చేసుకుందామా......


హోమ్ మేడ్ చాక్లెట్ తయారీకి కావలసిన ముఖ్యమైన పదార్థం కవరింగ్ చాక్లెట్. కుకింగ్ చాక్లెట్‌గా కూడా పిలవబడే ఈ వెరైటీ చాక్లెట్ సూపర్‌మార్కెట్స్, బేకరీలలో దొరుకుతుంది. ఇది మిల్క్, డార్క్, వైట్ అనే మూడు రకాలలో లభిస్తుంది.

ఇంట్లో చాక్లెట్ తయారుచేసుకోవటానికి కావలసిన మరికొన్ని వస్తువులు ప్లాస్టిక్‌మౌల్డ్స్, వేడిని తట్టుకోగలిగిన గాజుపాత్రలు, వెడల్పాటి రబ్బర్‌స్పూన్, రాపింగ్‌ఫాయిల్.


డబుల్ బాయిలింగ్ పద్ధతి

ఒక వెడల్పాటి పాత్రలో తగినంత నీరు తీసుకొని మరగనివ్వాలి. ఇంకో పాత్రలో చాక్లెట్‌ను ముక్కలుగా తుంచి వేసుకోవాలి. మరుగుతున్న నీటిపాత్రలో, చాక్లెట్ ముక్కలను వేసిన పాత్ర పెట్టి... చాక్లెట్ కరిగిపోయే దాకా రబ్బరు స్పూనుతో కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ‘కరిగిన చాక్లెట్’ ఉన్న గిన్నెను పక్కకు తీసుకుని రెండు మూడు నిమిషాలపాటు కలపాలి. ఈ మిశ్రమాన్ని రౌండ్‌గా ఉండే మౌల్డ్స్‌లో పోసి చల్లటి ప్రదేశంలో ఆరనివ్వాలి. (ఫ్రిజ్‌లో పెట్టకూడదు). గట్టి పడిన తరవాత నచ్చిన రాపింగ్‌ఫాయిల్‌తో కవర్ చేస్తే చాక్లెట్ రెడీ.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top