మనం నిద్రించే తీరు మన జీవితంలో ఆనందాన్ని నిర్దేశిస్తుందా?

మనం నిద్రించే తీరు మన జీవితంలో ఆనందాన్ని నిర్దేశిస్తుందా? అవుననే అంటున్నాయి తాజా పరిశోధనలు. కుడి వైపు కన్నా ఎడమవైపు ఒత్తిగిలి నిద్రించే వారికి మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటుందని, వారి జీవితం ఆనందమయంగా ఉంటుందని ఆ సర్వేలో తేలింది. ఎడమవైపు తిరిగి పడుకునే వారు రాత్రుళ్లు సాధారణంగా నిద్రలేవరట. వారికి చక్కని గాఢనిద్ర పడుతుందని ఆ సర్వే నివేదిక చెబుతోంది. కుడి వైపు తిరిగి పడుకునే వారి వదనం కళావిహీనంగా ఉంటుంది.


అదే ఎడమవైపు పడుకునే వారి ముఖం కాంతులీనుతూ ఉంటుందని అందులో పేర్కొన్నారు. కుడివైపు పడుకునే వారు ఉదయం నిద్రలేవడంతోనే చికాకుగా ఉంటారట. అలాగే ఆఫీసులో కూడా వారు అశాంతిగా ఉండి ఉద్యోగంపై దృష్టిని నిమగ్నం చేయలేరట. అయితే ఎడమవైపు పడుకునే వారు ఆఫీసులో సంతోషంగా పనిచేస్తారు కాని కుడివైపు వారే బాగా గడిస్తారని ఈ సర్వే తేల్చింది. అలాగే కుడివైపు పడుకునేవారికి ఉద్యోగ జీవితం నచ్చదట.

కాని ఎడమవైపు నిద్రించే వారు తాము చేస్తున్న ఉద్యోగాన్ని ప్రేమిస్తారట. ఎడమ పక్క తిరిగి పడుకునే వారు ఎంతటి గడ్డు పరిస్థితిలో అయినా నిబ్బరంగా ఉంటారట. అదే కుడివైపు పడుకునే వారు ఏ చిన ్న కష్టం వచ్చినా కలవరపాటుకు గురై మానసికంగా కుంగిపోతారట. ఎడమవైపు పడుకునే వారు ఎప్పుడు ఉల్లాసంగా ఉండటమే కాక ఆశావాద దృక్పథంతో జీవిస్తారట.

వీరు కుడివైపు పడుకునే వారితో పోల్చితే ఎక్కువ బరువైన పనులు కూడా ఈజీగా లాగిస్తారట. అంతేగాక ఎంత కష్టపడినా త్వరగా అలసిపోరు. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువే గాక వీరు పార్ట్ టైం ఉద్యోగాల కన్నా పర్మనెంట్ ఉద్యోగాలకే ప్రాధాన్యత ఇస్తారట. ఇక ఎటువైపు తిరిగి నిద్రపోవాలో మీదే చాయిస్!
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top