పుట్టిన బిడ్డ మొదటి 18 నెలలు తల్లి ఒడే మంచి బడి.

పుట్టిన బిడ్డ మొదటి 18 నెలలు తల్లికి దగ్గరగా ఉండటం వలన చక్కని కమ్యూనికేషన్ స్కిల్స్ అలవరచుకోవడానికి అవకాశాలున్నాయని అమెరికాకు చెందిన మిన్నెసొటా యూనివర్సిటీ పరిశోధకులు అంటున్నారు. మిగతా వారితో పోలిస్తే ఇలాంటి వారు చక్కని మానవసంబంధాలను కలిగి ఉంటారని వారు చెబుతున్నారు. కెరీర్‌లో బిజీగా ఉండటంతో కొంతమంది తల్లులు పిల్లలకు దూరమవుతున్నారు.

దాని ప్రభావంపైనే వీరు పరిశోధన చేశారు. పసిప్రాయంలో తల్లి సమక్షంలో పెరిగిన పిల్లలు మెరుగైన కమ్యూనికేషన్‌ను ప్రదర్శించారని, తల్లికి దూరంగా పెరిగిన వారు బిడియస్తులుగా ఉన్నట్టు పరిశోధనలో వెల్లడయిందని వారు చెబుతున్నారు. 18 నెలలు కుదరకపోతే కనీసం సంవతరం పాటైనా తల్లులు తమ పిల్లల్ని సాకితే మంచిదని చెబుతున్నారు వాళ్లు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top