వినాయకుని పెళ్లికి వెయ్యి విఘ్నాలు...ఈ సామెత ఎలా వచ్చిందో తెలుసా ?

వినాయకుడికి పెళ్లీడు దాటిపోతుండటంతో, దేవతలందరూ కలసి పెళ్లి చేసుకోమని అడిగారట. కానీ, రూపం, గుణగణాలు తదితర అన్ని లక్షణాలలోనూ తన తల్లి పార్వతికి సమానమైన కన్య దొరికితేగాని పెళ్లి చేసుకోనని భీష్మించుకున్నాడట వినాయకుడు. సాక్షాత్తూ జగజ్జనని అయిన పార్వతీదేవితో సరిసమానమైన కన్య దొరకటం మాటలు కాదు కదా!

ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో ఒక అడ్డు వచ్చిందే తప్ప పిల్ల మాత్రం దొరకలేదట! అందుకే ఈ సామెత పుట్టింది. ఏదైనా పని చేద్దామనుకున్నప్పుడు ఎక్కువ అడ్డంకులు వస్తే ఈ మాట అంటారు. అయితే ఆయనకు సిద్ధి, బుద్ధి అనే భార్యలున్నారని, వారి ద్వారా క్షేమం, లాభం అనే పుత్రులు కలిగారని మరో కథనం కూడా ఉంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top