కాబోయే అమ్మకు కావాల్సిన పోషకాలు...

అమ్మ కాబోతున్నట్లు తెలిసినప్పటి నుంచీ కాబోయే మాతృమూర్తి మధురానుభూతులకు లోనవుతుంది. తనకు పాప పుట్టే సమయం వరకు ఆమె అనేక ప్రయాసలకు లోనవుతుంది. పుట్టబోయే పాప ఆరోగ్యంగా ఉండేలా చూసేందుకు అనేక జాగ్రత్తలను తీసుకుంటుంది. పాప ఆరోగ్యంగా పుట్టే జాగ్రత్తలలో భాగంగా మెదడు ఎదుగుదల సక్రమంగా ఉండేలా చూసుకోవడం అవసరం. అందుకోసం కడుపులో ఉండగానే బేబీకి సక్రమంగా పోషకాలు అందేలా చూసుకోవడం మరికాస్త ఎక్కువ ఆవశ్యకం. బిడ్డలో మెదడు ఆరోగ్యకరంగా ఉండాలంటే డీహెచ్‌ఏ, కోలిన్ వంటి పోషకాలు అవసరం. 

మహిళ... గర్భధారణ నాటి నుంచి కనీసం 1000 రోజుల పాటు (అంటే గర్భధారణ సమయం 9నెలలతో పాటు బేబీకి కనీసం రెండేళ్లు వచ్చేవరకు అన్నమాట) మంచి పోషకాలు ఉండే ఆహారం తీసుకోవడం అన్నది పాప మెదడు బాగా ఎదగడానికి దోహదపడుతుందని శాస్త్రీయంగా నిరూపితం అయింది. దానికి తోడు మాతృప్రేమ అన్నది కూడా మానసిక వికాసానికి బాగా దోహదపడే అంశమని తేలింది.

అయితే ఒకవేళ కాబోయే మాతృమూర్తి దశ నుంచి తల్లి అయ్యాక రెండేళ్ల పాటు సరైన పోషకాలు... అంటే డీహెచ్‌ఏ, కోలైన్, ప్రోటీన్లు, ఫోలేట్, క్యాల్షియమ్, విటమిన్ సి, బి2, బి6, బి12, ఐరన్, కార్బోహైడ్రేట్స్ తీసుకోకపోతే పాపకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ.

పాలిచ్చే దశలో...
గర్భవతిగా ఉన్నప్పుడు పాపకు ఇచ్చే ఆహారంతో పాటు పాలిచ్చే సమయంలో తల్లి ఏమి తీసుకుంటుందనే అంశంపైనే పిల్లల పెరుగుదల ఆధారపడి ఉంటుంది. అయితే పైన పేర్కొన్న డీహెచ్‌ఏ, కోలిన్ వంటి పోషకాలు మాంసాహారంలో అయితే చేపల్లో ఎక్కువ. శాకాహారంలో ఫ్లాక్స్‌సీడ్ ఆయిల్‌లో ఎక్కువ. అయితే శాకాహారం కంటే చేపల్లో ఇది ఆరు రెట్లు ఎక్కువ. ఇప్పుడు కొత్తగా మార్కెట్‌లోకి వస్తున్న హార్లిక్స్ వంటి డయటరీ ఆహారంలోనూ డీహెచ్‌ఏ, కోలిన్ వంటివి ఎక్కువ.
  

మీ పాపకు డీఎన్‌ఏతో పాటు డీహెచ్‌ఏ ఇవ్వండి
డీహెచ్‌ఏ అంటే... డికోజా హెగ్జీనోయిక్ యాసిడ్ అనేది ఒక రకం పోషకం. గర్భవతిగా ఉన్నప్పటి నుంచి బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే సమయం వరకూ (బేబీకి రెండేళ్లు వచ్చేవరకు) తల్లి దీన్ని తీసుకోవడం వల్ల పిల్లల్లో మెదడులో చురుకుదనం పెరుగుతుంది. కోలిన్ అనే పోషకం మెదడు కణాల ఎదుగుదల కోసం ఉపయోగపడుతుంది. కణాల్లోని సిగ్నలింగ్ వ్యవస్థ కోసం ఇది పనికి వస్తుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top