దంతాలకు గుండెజబ్బులకు లింక్ ఉంది మీకు తెలుసా?

దంత సంరక్షణ తీసుకోకపోతే గుండె వ్యాధులు వచ్చే అవకాశముందని ఒక తాజా అధ్యయనంలో వెల్లడైంది. రోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత, రాత్రి నిద్రపోయే ముందు పళ్లు తోముకుంటే ఆరోగ్యంగా ఉంటామని డాక్టర్లు ఎప్పుడూ చెప్పేమాటే. అయితే తరచు దంత వైద్యులను సంప్రదించి దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం 24 శాతం తగ్గిపోతుందని తైవాన్‌లో ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. దంత వైద్యుల పర్యవేక్షణలో దంతాలను క్లీన్ చేసుకోవడం వల్ల బ్యాక్టీరియా తొలగి గుండె వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గిపోతుందని ఏడేళ్ల పాటు జరిపిన అధ్యయనంలో తేలింది.

చిగుళ్లకు సంబంధించిన వ్యాధులతో పడేవారిలో గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందట. నోటిలో 21 దంతాల కన్నా తక్కువ ఉన్న వారిలో గుండెజబ్బులు వచ్చే ప్రమాదం అధికంగా ఉందట. చిగుళ్ల నుంచి రక్తం కారడం, చిగుళ్ల వాపు వంటి వ్యాధులతో బాధపడేవారిలో గుండె వ్యాధులు వచ్చే అవకాశం 53 శాతం అధికంగా ఉందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. దంతాలకు, గుండెకు సంబంధం ఉంది కాబట్టి క్రమం తప్పకుండా దంత వైద్యులను సంప్రదించడం మంచిదంటున్నారు తైవాన్‌కు చెందిన పరిశోధకులు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top