మీరూ వరకట్నపు పెళ్లికొడుకును నచ్చిన ఆయుధంతో దాడి చేయాలనీ అనుకుంటున్నారా...అయితే ఇది చూడండి. .

వరకట్న వేధింపులు తట్టుకోలేక ప్రతీ నాలుగు గంటలకి ఒక యువతి మరణిస్తోందని 2007లో చేసిన స్టడీలో వెల్లడయ్యింది. అది తెలిసిన షాదీడాట్‌కామ్ వెబ్‌సైట్ వాళ్లు వరకట్న వేధింపులకు పాల్పడుతున్న వాళ్లని ఏమీ చేయలేమా అనుకున్నారు. ఇది పెళ్లి సంబంధాలు కుదిర్చే వెబ్‌సైట్. వెంటనే యాంగ్రీబ్రైడ్స్ అనే గేమ్ రూపొందించి షాదీడాట్‌కామ్ ఫేస్‌బుక్ పేజిలో పెట్టారు.

అలా పెట్టారో లేదో ఒకదానిమీద ఒకటి రెండు లక్షల అరవైఆరువేల లైక్స్ వచ్చిపడ్డాయి. అంటే ఎంతమందికి వరకట్నం పట్ల వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది. ఇంత ఆదరణ పొందిన ఈ గేమ్ ఆడాలంటే మీకు ఫేస్‌బుక్ అకౌంట్ ఉండాలి. అందులోకి లాగిన్ అయితే చాలు ఎంతో సులభంగా ఈ గేమ్ ఆడొచ్చు.

ఆట మొదలుపెట్టే ముందు సమయాన్ని సెట్ చేసుకోవాలి. పెళ్లి కొడుకు బొమ్మకి ఒక రేటు ట్యాగ్ ఉంటుంది. ఆట ఆడేవాళ్లు వాళ్లకు నచ్చిన ఆయుధంతో ఆ బొమ్మపై దాడి చేయొచ్చు. ఒక్కో దెబ్బకు పెళ్లికొడుకు రేటు తగ్గిపోవడంతోపాటు వరకట్న వ్యతిరేక ని«ధిలో డబ్బు జమ అవుతుంది. భలే ఆట కదూ. www.facebook.com/shaadicom ను క్లిక్ చేస్తే మీరూ వరకట్నపు పెళ్లికొడుకును బాదేయొచ్చు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top