మన ఆహార అలవాట్లే మన ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయి.మరి మీ ఆహారంలో ఇవి ఉన్నాయా?

మన ఆహార అలవాట్లే మన ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయంటున్నారు వైద్య నిపుణులు.అనారోగ్యకర ఆహార అలవాట్లు, ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో ఒత్తిడి, శారీరక వ్యాయామం కొరవడడం వంటి కారణాల వల్ల ఇటీవలి కాలంలో గుండెకు సంబంధించిన వ్యాధులు పెరుగుతున్నాయి. కొన్ని రకాల ఆహార పదార్థాలను తరచు తీసుకోవడం వల్ల ఈ సమస్యలను నివారించవచ్చని డైటీషియన్స్ సూచిస్తున్నారు.

పాలకూర, మెంతికూర, పుదీనా, తోటకూర, ముల్లంగి ఆకులు తదితర ఆకుకూరల్లో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉండడంతోపాటు పీచు పదార్థాలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. దీని వల్ల గుండె వ్యాధులు, క్యాన్సర్‌ను నివారించవచ్చు. గోధుమలు, బార్లీ, పప్పు దినుసులు, సజ్జలు, రాగులు, జొన్నలు, పచ్చ బఠానీలలో ఉండే పీచు పదార్థాలు, పోషకాలు గుండెకు చాలా మంచి చేస్తాయి.

ఆరోగ్యానికి మేలు చేసే నూనెలలో ఆలివ్ ఆయిల్ అతి ముఖ్యమైనది. ఇందులో వుండే ఒమేగా -3 చెడు కొలెస్టరాల్‌ను పారద్రోలుతుంది. టమోటాలలో లభించే విటమిన్-కె రక్తాన్ని శుద్ధి చేసే ఇంధనంగా పనిచేస్తుంది. ఆపిల్‌లో లభించే గ్వెర్‌సెటిన్ అనే పదార్థం రక్తంలో గడ్డలు ఏర్పడకుండా నివారిస్తుంది. రోజుకో ఆపిల్ తీసుకోవడం వల్ల వైద్యుని అవసరం ఉండదన్న విషయం వైద్యులు నిత్యం చెప్పేదే.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top